Asianet News TeluguAsianet News Telugu

బీజేపీతో నాకు శతృత్వం లేదు: రామ్‌మాధవ్‌తో భేటీ తర్వాత పవన్

బీజేపీతో తనకు వ్యక్తిగత శతృత్వం లేదని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికాకు వచ్చిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేత రామ్‌మాధవ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత  పవన్ కళ్యాణ్  ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

pawan kalyan interesting comments on bjp in america
Author
Amaravathi, First Published Jul 7, 2019, 11:50 AM IST

వాషింగ్టన్ డీసీ: బీజేపీతో తనకు వ్యక్తిగత శతృత్వం లేదని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికాకు వచ్చిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేత రామ్‌మాధవ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత  పవన్ కళ్యాణ్  ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రత్యేక హోదా ఇస్తామని  బీజేపీ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను ఆ పార్టీని డిమాండ్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని తాను కోరినట్టుగా చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ ప్రాంత ప్రజల్లో బలమైన కోరిక ఉందన్నారు. ఆ కోరిక మేరకు ప్రజలు తెలంగాణ సాధించుకొన్నారని ఆయన ప్రస్తావించారు. అయితే ప్రత్యేక హోదా అనేది కూడ తెలంగాణ సాధన మాదిరిగానే ఏపీ ప్రజల్లో కోరిక ఉందా లేదా అనేది తేలాలన్నారు. ఒకవేళ ప్రజల్లో ఆ కోరిక ఉంటే ప్రతి ఒక్కరూ కూడ ఈ సమస్యపై పోరాటం చేయాల్సిందేనన్నారు. 

పాత పరిచయంతోనే తాను రామ్ మాధవ్‌ను కలిసినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పనిచేయడమే తన చేతుల్లో ఉందన్నారు. ఫలితాలు తన చేతుల్లో లేవని పవన్ కళ్యాణ్ చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

పవన్‌తో రామ్ మాధవ్ భేటీ: ఎవరైనా రావొచ్చు, జనసేనానిపై కీలక వ్యాఖ్యలు

పవన్‌తో బీజేపీ నేత రామ్‌మాధవ్ భేటీ: మతలబు ఏమిటి

 

Follow Us:
Download App:
  • android
  • ios