విశాఖపట్నం: విశాఖపట్నం జనసేన కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక బలమైన వ్యూహంతో రాజకీయాల్లోకి వచ్చానని ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో అసెంబ్లీ అడుగుపెడతామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. 

తన దగ్గర డబ్బులు లేవని, కనీసం  జీవనోపాధిని  కూడా కోల్పోయానని అయితే ప్రజలకు సేవ చెయ్యాలనే సంకల్పం మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు. తాము ఉన్నామంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తామంటూ నినాదాలు చేశారు.

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కావాల్సింది ఓట్లు మాత్రమేనని ప్రాణాలు కాదన్నారు. ఈ సందర్భంగా అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో బైక్ లపై వేగంగా వెళ్లొద్దన్నారు. గాయాల పాలవ్వొద్దని సూచించారు. గాయాలైతే ఓట్లు వేసేది ఎవరని ప్రశ్నించారు. 

తనపై అభిమానంతో బైక్ ర్యాలీలు నిర్వహించి దెబ్బలు తింటే ఇంట్లో ఆడవాళ్లు సైతం మారిపోతారన్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ కి వెళ్లాడు దెబ్బలు తిని వచ్చాడని వారిలో నెగిటివ్ ఓపెనీయన్ వస్తే ప్రమాదమన్నారు. దయచేసి దండం పెడతా ఇలాంటి పనులు మాత్రం చెయ్యొద్దన్నారు. 

అలాగే సర్వేల పేరుతో కొందరు వస్తున్నారని అన్నీ చెప్పండి కానీ ఏ పార్టీకి ఓటు వేస్తున్నామో మాత్రం చెప్పొద్దని చెప్పకుండా సైలెంట్ గా ఓటు వెయ్యండంటూ పవన్ కళ్యాణ్ సూచించారు.   

ఈ వార్తలు కూడా చదవండి

తన పోటీపై మరో మాట చెప్పిన పవన్ కల్యాణ్

మంత్రి గంటాపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు