లోకేశ్ గెలవరని చంద్రబాబుకు నమ్మకం.. సినిమా వాడినే.. నాకు రాజకీయాలు తెలుసు

pawan kalyan fires on chandrababu naidu
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారాలోకేశ్ మీదా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి నారాలోకేశ్ మీదా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన చంద్రబాబుకు ఆయన కుమారుడు లోకేశ్ ఎమ్మెల్యేగా గెలుస్తాడనే నమ్మకం లేదని ఆరోపించారు.

సినీనటుడికి రాజకీయాలంటే ఏం తెలుసని తనను కొందరు విమర్శిస్తున్నారని.. తాను ఏ విధానంపైన అయినా మాట్లాడటానికి సిద్ధమని.. తాను అన్ని విషయాలను చదువుకునే రాజకీయాల్లోకి వచ్చానని, విధానాలపై చర్చించేందుకు చంద్రబాబు, లోకేశ్, జగన్ రావాలని డిమాండ్ చేశారు.. తాను కొందరిలా ఐఏఎస్‌లపై ఆధారపడే వాడిని కాదని పవన్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే జనసేన లక్ష్యమని.. బలమైన భావజాలంతోనే జనసేన పార్టీని స్థాపించానని పవన్ తెలిపారు. సమాజంలో ధనవంతులు మరింత సంపన్నులు అవుతున్నారని.. పేదల పరిస్థితులు మాత్రం మారడం లేదని.. జనం సమస్యలపై మాట్లాడే పార్టీ జనసేన అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

loader