విజయవాడ: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్న కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో జగన్ వాడే భాష సరైంది కాదన్నారు. గురువారం విజయవాడలోని జనసేన కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమావేశమైన పవన్ తాను జగన్ లా చంపెయ్యండి, చింపేయండిలాంటి పదజాలాన్ని ఉపయోగించనన్నారు. 

ఎప్పుడు విమర్శలు చేసినా సంస్కారవంతమైన భాషనే ఉపయోగించానన్నారు. తాను టీడీపీలో వ్య‌క్తులెవ‌ర్నీ వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌లేదన్నారు. జ‌న‌సేన ఐడియాల‌జీకి అనుగుణంగా ఒక ఫ్రేమ్ వ‌ర్క్‌లో మాత్ర‌మే వారిని విమర్శించినట్లు చెప్పారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిలా  చంపేయండి, చింపేయండి వంటి మాట‌ల‌ను తాను ఉప‌యోగించ‌లేదన్నారు. 

మరోవైపు 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతు ప్రకటించడానికి గల కారణాలను కార్యకర్తలకు వివరించారు. నరేంద్రమోదీ ప్ర‌ధాని అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి మేలు చేస్తార‌న్నగట్టి నమ్మకంతో మద్దతు పలికినట్లు తెలిపారు. 
 
మ‌నం ఎదుటి వారిని ప్ర‌శ్నించాలంటే నైతిక బ‌లం అవసరమని ఆ నైతిక బలం కోసమే 2014 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీలకు మద్దతు పలికినట్లు చెప్పుకొచ్చారు. 2014లో ప‌రిమిత స్థానాల్లో పోటీ చేద్దామ‌ని తొలుత భావించానని అయితే పార్టీ బలపడదన్న ఆలోచనతో పోటీకి దూరంగా ఉండిపోయానన్నారు. తాను పోటీకి దూరంగా ఉండటం వల్ల జ‌న‌సేన మ‌ద్ద‌తు ప‌లికిన తెలుగుదేశం, బీజేపీలు అధికారంలోకి వచ్చాయన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అందుకే జనసేన పార్టీ ఆవిర్భవించింది : పవన్ కళ్యాణ్

యువ శక్తి రాజకీయ శక్తిగా మారాలి, నేను మారుస్తా: పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో అలాంటి నాయకుడు ఒక్కరూ లేరు: పవన్ ఆవేదన