సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం నారా లోకేష్ గాలి తీసేసారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటిరిగానే 175 స్ధానాల్లో పోటీ చేస్తుందని స్పష్టంగా ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ ఈ విధంగా చెప్పిన తర్వాత ఆమధ్య నారా లోకేష్ చేసిన ప్రకటనకున్న విలువెంత? వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన, భాజపాలతో టిడిపి కలిసే పోటీ చేస్తుందని ఆమధ్య నారా లోకేష్ చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది.
సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సోమవారం నారా లోకేష్ గాలి తీసేసారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటిరిగానే 175 స్ధానాల్లో పోటీ చేస్తుందని స్పష్టంగా ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదికూడా రెండు తెలుగురాష్ట్రాల్లో పోటీ చేస్తుందన్నారు. జనసేనకు బలముందని, గెలుస్తుందన్న నమ్మకమున్న ప్రతీ సీటులోనూ పోటీ చేస్తుందని చెప్పారు. మరి, పవన్ ఈ విధంగా చెప్పిన తర్వాత ఆమధ్య నారా లోకేష్ చేసిన ప్రకటనకున్న విలువెంత? వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన, భాజపాలతో టిడిపి కలిసే పోటీ చేస్తుందని ఆమధ్య నారా లోకేష్ చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి, ఆ ప్రకటనకు ఇపుడు పవన్ చేసిన ప్రకటనతో ఏపాటి విలువిస్తున్నారో తెలిసిపోయింది. ఎందుకంటే, నారా లోకేష్ ఏమీ దారినపోయే దానయ్య కాదుకదా?
నారా లోకేష్ అంటే టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి. మంత్రివర్గంలో కీలక సభ్యుడు. పైగా నారా చంద్రబాబునాయుడు కొడుకు. ఇన్ని భుజకీర్తులన్న తర్వాత లోకేష్ ఏదైనా ప్రకటన చేస్తే దానికి ఎంతో విలువుంటుందనే అనుకుంటారు ఎవరైనా ? ఎందుకంటే, లోకేష్ ఏదైనా ప్రకటన చేస్తే చంద్రబాబు తరపున ప్రకటన వచ్చినట్లుగానే అందరూ భావిస్తారు. అటువంటిది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే విషయంలో జనసేన అధ్యక్షుడు నారా లోకేష్ కు పూచికపుల్లంత విలువ కూడా ఇవ్వలేదు.
సరే ప్రస్తుత విషయానికి వస్తే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోయే స్ధానాల సంఖ్యను చెప్పేసారు. అదీ రెండు రాష్ట్రాల్లో కలిపి. మొత్తం 294 సీట్లకు గాను 175 సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారంటే, ఏదో లెక్క ఉండే ఉంటుంది. సర్వే లాంటిది ఏమన్నా చేసుకున్నారేమో తెలీదు. జనసేన పోటీ చేయబోయే సీట్ల విషయంలో మొత్తానికంటూ ఓ ఫిగర్ బయటకు వచ్చేసింది కాబట్టి ఇక తేలాల్సింది తెలుగుదేశంపార్టీ, భాజపాల విషయమే.
టిడిపి, భాజపాలు కలిసే పోటీ చేస్తాయని ఒకసారి, లేదు భాజపా ఒంటిరిగానే పోటీ చేస్తుందని ఒకసారి రకరకాల ప్రకటనలు వస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. అంటే పై రెండు పార్టీల మధ్య కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో స్పష్టత లేదన్న విషయం అర్ధమవుతోంది. ఈ రెండు పార్టీల విషయం కూడా తేలిపోతే, వచ్చే ఎన్నికల్లో చాలా సీట్లలో త్రిముఖమా లేక చతుర్ముఖ పోటీనా అన్నది తేలిపోతుంది.
