Asianet News TeluguAsianet News Telugu

త్వరలో ‘భాగస్వామ్య’ జాతర

గడచిన రెండు సంవత్సరాల్లో నిర్వహించిన సదస్సుల ద్వారా వచ్చిన పెట్టుబడుల సంగతి దేవుడెరుగు, ఖర్చు మాత్రం సుమారు రూ. 50 కోట్లైంది.

partnership carnival soon

మళ్ళీ భాగస్వామ్య సదస్సా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి దుబారాకు బాగా అలవాటు పడిపోయారు. ఏదో పేరు చెప్పటం కోట్ల రూపాయలు ఖర్చు చేయటం రివాజుగా మారిపోయింది. పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈనాలాఖరులో విశాఖపట్నంలో మూడు రోజుల పాటు భాగస్వామ్య సదస్సు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

 

చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. అయితే, ఫలితం మాత్రం లేదు. సదస్సులో లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరగుతున్నాయి. విపరీతంగా ప్రచారం మాత్రం వస్తోంది. ప్రచారం కూడా అలా ఇలా కాదు. అంతా లక్షల కోట్లలోనే.

 

పోయిన సంవత్సరం జరిగిన సదస్సులో ఏకంగా రూ. 4.8 లక్ష్లల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు  జరిగినట్లు స్వయంగా సిఎమ్మే ప్రకటించారు. అందరూ నిజమేననుకున్నారు. తీరా చూస్తే ఇంత వరకూ వచ్చింది ఏమీ లేదు. చర్చలు జరిగేటపుడు సంస్ధల సామర్ధ్యాన్ని ఏమాత్రం పరిశీలించకుండానే ఒప్పందాలు చేసుకోవటంతోనే ఈ సమస్యలు వస్తున్నాయి.

 

పోయిన సదస్సులో జీటివి అసోసియేట్స్..అనే సంస్ధతో రూ. 2825 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నది ప్రభుత్వం. 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పింది. తీరాచూస్తే సంస్ధలో 10 మాత్రమే పనిచేస్తున్నారని సమాచారం. మరో కంపెనీ 12 వేల మందకి ఉపాధి కల్పిస్తామంటూ వచ్చింది. రూ. 3025 కోట్లతో ఒప్పందాలు జరిగినట్లు ఘనంగా ప్రకటించింది పరిశ్రమల శాఖ. తీరాచూస్తే ఆ సంస్ధను భార్యా, భర్తలు మాత్రమే నిర్వహిస్తున్నారట.

 

ఒప్పందాలు చేసుకున్న సంస్ధల్లో ఇటువంటివే అత్యధికం. మరి వీళ్లంతా పెట్టుబడుల విషయంలో ఎందుకు ముందుకు రాలేదు? అంటే కేవలం ప్రచారం కోసమే వచ్చారు..వెళ్ళారు... అంతే. గడచిన రెండు సంవత్సరాల్లో నిర్వహించిన సదస్సుల ద్వారా వచ్చిన పెట్టుబడుల సంగతి దేవుడెరుగు, ఖర్చు మాత్రం సుమారు రూ. 50 కోట్లైంది. దాంతో మూడోసారి సిఎం మళ్ళీ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలనగానే అధికారులు ఏమాత్రం ఉత్సాహం చూపటం లేదు. కానీ తప్పదు కదా! చంద్రబాబు చెప్పిన తర్వాత చేసేదేముంది తప్పని సరి తద్దినమంటూ అధికారులు పనులు మొదలుపెట్టారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios