లోకేశ్ చేతికి పగ్గాలు వచ్చేటప్పటికి అనంతపురం జిల్లాను శాసించే నాయకుడొకరు తయారుకావాలి. ఈ ఇమేజ్ను తెచ్చే రీతిలో పరిటాల శ్రీరాం పెళ్తి సందడి, వేడుకలు నడుస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళ, శిశుసంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్-జ్ఞానల వివాహ వేడుక అనంతపురం జిల్లా వెంకటాపురంలోఘనంగా జరుగుతున్నది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రావడంతో పెళ్లి సందడి మరీ ఎక్కువయింది రాష్ట్ర మంత్రులు, వీవీఐపీలు హాజరయ్యారు. ఈ ప్రాంతంలో లక్షల మంది పరిటాల రవి అభిమానులున్నారు. వారంతా ఈ వివాహానికి హాజరవుతున్నారు.పరిటాల సునీత ఎన్నికల విజయంతర్వాత పరిటాల రవి ఇంట్లో జరుగుతున్న శుభకార్యమిదే.
అందువల్ల ఎక్కడెక్కడి అభిమానులు పెళ్లి వేడుకకు వస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని భారీగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంత్రులు కాలువ శ్రీనివాసులు, ఘంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పార్థసారధి, పల్లె రఘునాథరెడ్డి రెండు రోజులుగా పెళ్లి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
అన్నింటి కంటే ముఖ్యంగా పరిటాల కుటుంబలో జరుగుతున్న రాజకీయ పట్టాభిషేకంగా దీనిని ప్రజలు చూస్తున్నారు.2019లో ఆయన రాజకీయ ప్రవేశానికి తండ్రి పరిటాల రవి అభిమానుల, స్నేహితులు ఆశీస్సులందుకునేందుకు పెళ్లి సరయిన వేదిక. పరిటాల రవి చనిపోయేనాటికి శ్రీరాం చిన్న పిల్లవాడే. అందువల్ల రవి వారసత్వం వెంటనే స్వీకరించలేకపోయాడు. ఈ మధ్యలో తల్లి సునీత ఎమ్మెల్యే అయి, మంత్రి అయినా, రవి లేని లోటు అనంతపురం రాజకీయాలలోకనిపిస్తూఉంది. పరిటాల రవికి రాబిన్ హుడ్ ఇమేజ్ ఉండేది.
శ్రీరాం తండ్రి లోటును పూరిస్తారో లేదో చెప్పడం కష్టం గాని, అతని రాజకీయ ప్రవేశం కోసం ఒక వర్గం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నది.తెలుగుదేశం పార్టీకి కూడా జిల్లాలో పెద్ద సరైన ‘దిక్కు’ లేదు. పార్టీలో ఉన్ననేతలు కాలువ శ్రీనివాసులు, పల్లె రఘు నాథ రెడ్డి, పార్థసారధి, పైయ్యావుల కేశవ్ తదితరులంతా నియోజకవర్గంవారే. అందువల్ల జిల్లా మీద పట్టు సాధించే రీతిలో ఒక నాయకుడు అవసరం. ఇపుడుజిల్లా ‘పాలెగార్ ’ లుగా ముద్ర పడిన జెసి దివాకర్ రెడ్డి,ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డిలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి నాయకత్వం ఇచ్చే పరిస్థితిలేదు. వాళ్లని ఎంతవరకు వాడుకోవాలో ఆయను తెలుసు. చంద్రబాబు వారసుడు లోకేశ్ పగ్గాలు పట్టేటప్పటికి అనంతపురం జిల్లాను శాసించే నాయకుడొకరు తయారుకావాలి. ఈ ఇమేజ్ ను తెచ్చే రీతిలో ఇపుడు పెళ్తి సందడి, వేడుకలు నడుస్తున్నాయి. వచ్చే విఐపిలకు, ప్రజలకు ఒకటే సందేశం, పరిటాల కుటుంబం వెంట ఎంత బలగం ఉంది అని చెప్పడమే... పెళ్లి సందేశం. దీవెనలు కూడా రాజకీయాంగా తండ్రి అంతటి వాడుకావాలని, పైకి రావాలనే. ఇంతవరకు పరిటాల రవి వెనక జనం, పలుకుబడి ప్రదర్శన జరిగే అవకారం పరిటాల కుటుంబానికి రాలేదు.
పెళ్లి సందడి గ్యాలరీ
http://telugu.asianetnews.com/home-page/wedding-bells-ring-for-paritala-sriram
