అమరావతి: టీడీపీ హయాంలో జరిగిన పనులపై కాగ్ ఆడిట్ చేయాలని దాఖలైన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది.  ఆడిట్ చేయాలని నేరుగా కాగ్ కు వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్ కు సూచించిన హైకోర్టు. 

టిడిపి హయాంలో భారీ అవినీతి జరిగిందంటూ వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే టిడిపి హయాంలో వివిధ పనుల కోసం నిర్ణయించిన టెండర్లను కాదని రివర్స్ టెండరింగ్ చేపట్టింది జగన్ సర్కార్. రివర్స్ టెండరింగ్ ద్వారా భారీగా ప్రభుత్వ ధనాన్ని ఆదా చేస్తున్నామని... దీన్ని బట్టి టిడిపి హయాంలో భారీ అక్రమాలు జరిగాయని అర్థమువుతుందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు టిడిపి ప్రభుత్వం హయాంలో జరిగిన పనులన్నింటిపై ఆడిట్ చేపట్టాలని కాగ్ ను ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. 

అయితే ఈ పిటిషన్ హైకోర్టు తాజాగా తిరస్కరించింది. అయితే పిటిషన్ ను డిస్పోజ్ చేసినప్పటికి ఆడిట్ చేపట్టాలని స్వయంగా కాగ్ కే వినతిపత్రం సమర్పించాలని సూచించింది.