Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో గంజాయి తోటల ధ్వంసం: పోలీసులపై గిరిజనుల దాడి, కన్నీళ్లు పెట్టుకొన్న స్థానికులు

విశాఖ జిల్లాలోని జి.మాడుగుల మండలం బొయితిలి గ్రామంలో గంజాయి తోటలను ధ్వంసం చేసేందుకు వచ్చిన పోలీసులను స్థానిక గిరిజనులుఅడ్డుకొన్నారు. పోలీసులపై దాడికి దిగారు

operation Ganja: Tribes obstructed police  In Visakhapatnam
Author
Visakhapatnam, First Published Nov 3, 2021, 5:22 PM IST

విశాఖపట్టణం: విశాఖ జిల్లాలో Ganja తోటలను ధ్వంసం చేస్తున్న అధికారులను బుధవారం నాడు Tribe మహిళలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ భారీగా police బలగాలు మోహరించాయి. స్థానిక గిరిజన మహిళలతో పోలీసు అధికారుల బృందం చర్చలు జరిపారు. గంజాయి పెంపకంతో ఆధారపడి ఉన్న తమకు ఈ ఏడాది గంజాయి సాగుకు అవకాశం ఇవ్వాలని అధికారులను గిరిజనులు వేడుకున్నారు.

also read:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో..

 ఒకవేళ ఈ ఏడాది గంజాయి తోటలను ధ్వంసం చేస్తామంటే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, ఒక బృందం అధికారులు గిరిజన మహిళలతో చర్చలు జరుపుతుండగామరో బృందం గంజాయి సాగును ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. 

దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. Visakhapatnam ఏజెన్సీలో గంజాయిని తోటలను ధ్వంసం చేసే పనిని పోలీసులు, Excise అధికారులు చేపట్టారు. అయితే కొన్ని రోజులుగా ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులు సహకరిస్తున్నారు. కానీ ఇవాళ మాత్రం గిరిజనులు మాత్రం సహకరించలేదు. పోలీసులపై దాడులకు దిగారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. బుధవారం నాడు విశాఖపట్నంలోని జి.మాడుగుల మండలం బొయితిలి పరిసర ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లారు. గంజాయి తోటలను గిరిజనులు అడ్డుకొన్నారు.

దేశంలోని ఎక్కడ గంజాయి దొరికినా కూడ ఏపీ రాష్ట్రంతో లింకులుంటున్నాయని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో గంజాయి రవాణాను అడ్డుకొనేందుకు ఇతర రాష్ట్రాల పోలీస్ అధికారులతో ఏపీ డీజీపీ సవాంగ్ ఇటీవలనే విశాఖలో సమావేశం నిర్వహించారు.

 గంజాయి సాగు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది  జగన్ సర్కార్. గంజాయి కనిపిస్తే చాలు కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు.. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గంజాయిని ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. గంజాయి తోటల ధ్వంసాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

అయితే,  వచ్చే ఏడాది నుంచి గంజాయి సాగు చెయ్యబోమని హామీ ఇచ్చారు. బంగారం తాకట్టు పెట్టి మరి గంజాయి సాగుపై పెట్టుబడి పెట్టామని, ఈ ఒక్కసారికి వదిలేయాలని కన్నీటిపర్యంతం అయ్యారు గిరిజన మహిళలు.విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు చాలా ఏళ్లుగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా గంజాయి రవాణాను అరికట్టడంలో వైఫల్యం చెందారనే విమర్శలు లేకపోలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios