రాజమండ్రి:  తూర్పు గోదావరి  జిల్లాలో ముమ్మిడివరం మినహా ఏ అసెంబ్లీకి అభ్యర్థిని ప్రకటించలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎవరికీ కూడ  పార్టీ టిక్కెట్లను ఇవ్వలేదని  ఆయన  ప్రకటించారు.

రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన  కవాతు,  సభ అనంతరం  జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్  సమావేశమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరం  అసెంబ్లీ స్థానానికి  బాలకృష్ణ పేరును ఫైనల్ చేశాను, మిగిలిన ఏ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదని పవన్  పార్టీ కార్యకర్తలకు స్పష్టత ఇచ్చారు.

అనవసరపు పనులతో పార్టీని  చంపొద్దని పవన్ కళ్యాణ్  కార్యకర్తలకు తేల్చి చెప్పారు. సమాజంలో మార్పు రావాలంటే  ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు  జనసేన ద్వారా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకొని మరోసారి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నట్టు పవన్ కళ్యాణ్  కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కవాతును  విజయవంతం చేసిన కార్యకర్తలను ఆయన అభినందించారు.

సంబంధిత వార్తలు

జనసేనలో నాదెండ్ల చేరిక వెనక పారిశ్రామికవేత్త: ఎవరాయన?

చంద్రబాబు, జగన్‌లపై పవన్ ఫైర్..."కవాతు ఎందుకు చేపట్టామంటే"

నేను బల ప్రదర్శన చేస్తే.. శత్రువులు మిగలరు.. పవన్

కాటన్ బ్యారేజ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతు (ఫోటోలు)

చంద్రబాబు క్లీన్‌గా బయటకు రావాలి: పవన్‌కళ్యాణ్

ధవళేశ్వరం బ్రిడ్జిపై పవన్: కవాతులో కదం తొక్కిన జనసైనికులు

పవన్ కళ్యాణ్‌కు షాక్: ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతుకు అనుమతి నిరాకరణ

కవాతులో పాల్గొండి.. మీ కుటుంసభ్యులను గుర్తుపెట్టుకోండి: పవన్ ట్వీట్