పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయితీ రాజ్ మంత్రి చేశారని లోకేష్ పై నిప్పులు చెరిగారు. 

రాజమండ్రి:తనపై వస్తున్న ఆరోపణల నుండి ముఖ్యమంత్రి క్లీన్‌గా బయటకు రావాలన్నారు. చేయాల్సిన తప్పులు చేసి డొంకలో దాక్కొంటే పిడుగుపాటు తప్పదని  పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.ఏపీలో కొందరు ప్రజా ప్రతినిధులతో పాటు, కొన్ని సంస్థలపై జరిగిన ఐటీ దాడులపై పవన్ కళ్యాణ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

జనసేన కవాతు పిచ్చుకలంక  నుండి ధవళేశ్వరం వరకు సాగింది. కవాతు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్  సర్ ఆర్థార్ కాటన్  విగ్రహం వద్ద  సోమవారం నాడు నిర్వహించిన సభలో ఆయన  మాట్లాడారు.కొడుకుకు  తండ్రి వారసత్వం రావాలని కోరుకొంటారు. కానీ, లోకేష్‌ను సీఎం చేసేందుకు  జనసేన టీడీపీకి మద్దతిచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. 

ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేసినా.. సీఎం కార్యాలయంపై దాడులు చేస్తే తాము అండగా ఉంటామన్నారు. అండమాన్ లో , గుంటూరులో ఐటీ దాడులు జరిగితే  టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడంగా ఎలా అవుతోందని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తే  అనేక విషయాల్లో తాను సీఎంతో విబేధించినా కూడ రాష్ట్ర ప్రజల కోసం తాను చంద్రబాబుకు అండగా నిలుస్తామన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబునాయుడు క్లీన్ గా బయటకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

స్వంత సోదరుడినే రాజకీయాల్లో విబేధించినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్నయ్యను వదిలేసి 2014లో టీడీపీకి మద్దతిచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి తనకు బంధువా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తాను బీజేపీని కడిగిపారేసినట్టు ఆయన గుర్తుచ ేశారు.

బీజేపీని కడిగేసింది, ఏకేసీంది, దుమ్మెత్తిపోసింది జనసేన పార్టీయేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. జనసేనను వైసీపీ, బీజేపీకి లింక్ పెట్టకూడొద్దన్నారు.ప్రత్యేక హోదా ఇవ్వని రోజునే తాను బీజేపీని కడిగేస్తే టీడీపీ నేతలు సన్మానాలు చేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తనకు బీజేపీకి లింకులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజకీయాల్లో తన సోదరుడినే విబేధించినట్టు ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సోదరుడినే పక్కన పెట్టి టీడీపీకి మద్దతిచ్చానన్నారు.

పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయితీ రాజ్ మంత్రి చేశారని లోకేష్ పై నిప్పులు చెరిగారు. లోకేష్ కు ఏం తెలుసునని పవన్ ప్రశ్నించారు.తాను సినీ యాక్టర్ అంటారు.. మరి లోకేష్ కు ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. 

తనకుసీఎం పదవి అలంకారం కాదన్నారు. ఓ కానిస్టేబుల్ కొడుకు  సీఎం కాలేడా అని ఆయన ప్రశ్నించారు. లోకేష్, జగన్ లా తనకు సీఎం పదవి వారసత్వం కాదన్నారు.  తనను అనేక అవమానాలకు గురిచేశారని చెప్పారు.  అన్నింటిని  భరిస్తాం, సహిస్తామన్నారు. ఇక తట్టుకోలేని పరిస్థితి వస్తే తాట తీస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

నేతల తప్పుడు వాగ్దానాలతో రగిలి రగిలి జనసేనను ఏర్పాటు చేసినట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీని ప్రజల ప్రయోజనాల కోసమే  ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దౌర్జన్యాల్ని చీల్చి చెండాడే కొదమ సింహాలే జనసైనికులని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అవినీతిపై జనసైనికులు పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు.

తనకు దేశం మీద, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ల మీద ప్రేమ ఉందన్నారు.  మంచి పాలన అందిస్తాడనే ఉద్దేశ్యంతోనే  తాను  2014 ఎన్నికల సమయంలో టీడీపీకి  మద్దతు ఇచ్చినట్టు చెప్పారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తనకు  మర్యాద ఇస్తాడని చెప్పారు. జనసేన మాత్రం ప్రజల్లోకి వెళ్లకూడదని బాబు భావిస్తున్నాడన్నారు.  టీడీపీని మోసేందుకు తాను  జనసేన పార్టీని ఏర్పాటు చేయలేదన్నారు.

2014లో ఓట్లు చీలకూడదనే ఉద్దేశ్యంతోనే తాను ఆనాడు పోటీ చేయలేదన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా కూడ మౌళిక వసతులు లేవన్నారు. అవినీతి గురించి మాట్లాడితే తాను సడెన్‌గా మారిపోయానని చంద్రబాబునాయుడు తనను విమర్శిస్తున్నాడని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

జన్మభూమి కమిటీల... దోపీడీ కమిటీలా.. వ్యవస్థను నిర్వీర్యం చేసే కమిటీలా తనకు అర్థం కావడం లేదన్నారు.2019 ఎన్నికల్లో మరోసారి  అధికారంలోకి వచ్చి మీరేం చేస్తారని  ఆయన ప్రశ్నించారు. 

వైసీపీ చీఫ్ జగన్ పై తనకు వ్యక్తిగతంగా కోపం లేదన్నారు. మీ ఫ్యాక్షన్ రాజకీయాలను గోదావరి జిల్లాలకు తేస్తే  తన్ని తగిలేస్తామని ఆయన హెచ్చరించారు.మేం ఉప్పు, కారం తినమా అని ఆయన ప్రశ్నించారు.  సీఎంకు, విపక్షనేతలను పవన్ హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలని సూచించారు.

వ్యవస్థను అడ్డంపెట్టుకోవాలని బాబు ప్రయత్నిస్తే... మరో రకంగా బెదిరింపులకు పాల్పడాలని మరో నేత  ప్రయత్నిస్తే బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించి  ఆ ఉద్యమంలో నలిపేస్తామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

ధవళేశ్వరం బ్రిడ్జిపై పవన్: కవాతులో కదం తొక్కిన జనసైనికులు

పవన్ కళ్యాణ్‌కు షాక్: ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతుకు అనుమతి నిరాకరణ

కవాతులో పాల్గొండి.. మీ కుటుంసభ్యులను గుర్తుపెట్టుకోండి: పవన్ ట్వీట్