Asianet News TeluguAsianet News Telugu

ధవళేశ్వరం బ్రిడ్జిపై పవన్: కవాతులో కదం తొక్కిన జనసైనికులు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద సోమవారం నాడు జనసేన కవాతు నిర్వహించింది. ఈ కవాతులో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కవాతుకు  పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా  ఆ పార్టీ కవాతును నిర్వహించింది.

Janasena chief pawan kalyan starts kavath in east godavari district
Author
Rajahmundry, First Published Oct 15, 2018, 3:35 PM IST


రాజమండ్రి:తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద సోమవారం నాడు జనసేన కవాతు నిర్వహించింది. ఈ కవాతులో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కవాతుకు  పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా  ఆ పార్టీ కవాతును నిర్వహించింది.

జనసేన కవాతుతో పాటు పాటు,  మోరంపూడి వద్ద  జనసేన ఏర్పాటు చేసిన సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.  ధవళేశ్వరం బ్రిడ్జి బలహీనంగా ఉన్నందున కవాతుకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.

పిచ్చుకలంక నుండి ధవళేశ్వరం వరకు కవాతు నిర్వహించనున్నారు.  కవాతు తర్వాత పవన్ కళ్యాణ్ ఆర్ధర్ కాటన్ విగ్రహం వద్ద సభలో పాల్గొంటారు.ఇదిలా  ఉంటే సభాస్థలి వరకు పవన్ కళ్యాణ్ కారులోనే వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. లేకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోలీసుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ కారులోనే సభాస్థలికి  బయలు దేరారు.కారుపై  నిలబడి కార్యకర్తలకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్  సభాస్థలికి బయలుదేరారు. దారిపొడవునా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పై పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకొన్నారు. కారులోనే పవన్ సభాస్థలికి చేరుకొన్నారు.

 

సంబంధిత వార్తలు

పవన్ కళ్యాణ్‌కు షాక్: ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతుకు అనుమతి నిరాకరణ

కవాతులో పాల్గొండి.. మీ కుటుంసభ్యులను గుర్తుపెట్టుకోండి: పవన్ ట్వీట్

Follow Us:
Download App:
  • android
  • ios