Asianet News TeluguAsianet News Telugu

జనసేనలో నాదెండ్ల చేరిక వెనక పారిశ్రామికవేత్త: ఎవరాయన?

విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడానికి కారమంటున్నారు. ఈ పారిశ్రామికవేత్త పవన్ కల్యాణ్ కే కాకుండా నాదెండ్లకు సన్నిహిత మిత్రుడనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ పారిశ్రామికవేత్త ఎవరనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Nadendla's Jana Sena entry: Advantage to Pawan
Author
Vijayawada, First Published Oct 17, 2018, 2:33 PM IST

విజయవాడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడానికి పెద్ద కసరత్తే జరిగినట్లు చెబుతున్నారు. వీర కాంగ్రెసువాదిగా పేరు తెచ్చుకున్న నాదెండ్ల మనోహర్ అకస్మాత్తుగా పవన్ కల్యాణ్ తో చేతులు కలిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. నాదెండ్ల చేరిక వెనక ఓ పారిశ్రామికవేత్త ఉన్నట్లు చెబుతున్నారు. 

విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరడానికి కారమంటున్నారు. ఈ పారిశ్రామికవేత్త పవన్ కల్యాణ్ కే కాకుండా నాదెండ్లకు సన్నిహిత మిత్రుడనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ పారిశ్రామికవేత్త ఎవరనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా, నాదెండ్ల మనోహర్ చేరిక పవన్ కల్యాణ్ కు కలిసి వచ్చే అంశమని అంటున్నారు. జనసేన ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమనే అభిప్రాయాన్ని తుడిచివేయడానికి అది పనికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలంగా ఉన్న రెండు సామాజిక వర్గాలకు కూడా జనసేన ప్రాతినిధ్యం వహిస్తుందనే అభిప్రాయం వేళ్లూనుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

దానికి తోడు, రాజకీయ వ్యూహకర్తగా కూడా జనసేనకు నాదెండ్ల ఉపయోగపడుతారని సమాచారం. అంతేకాకుండా ఆయనకు వివాదరహితుడనే పేరు ఉంది. ఆయన వల్ల గుంటూరు జిల్లాకు చెందిన కొంత మంది నాయకులు జనసేనలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగుదేశం నాయకుడు దేవినేని మల్లిఖార్జున రావు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మర్రి రాజశేఖర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డికి కూడా జనసేన గాలం వేసినట్లు చెబుతున్నారు. 
 
ఉభయ గోదావరి జిల్లాల్లోనూ గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోనూ నాదెండ్ల మనోహర్ జనసేనకు గట్టి వ్యవస్థాగత నిర్మాణం చేయగలరని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios