రెండేళ్లు దాటినా అద్దె చెల్లించడం లేదని ఓ యజమాని ఆగ్రహంతో.. కిరాయికి ఇచ్చిన షాపులోని టెంట్ హౌస్ సామగ్రికి నిప్పుపెట్టాడు. అయితే ఆ మంటలు అతడినీ చుట్టుముట్టడంతో తీవ్రగాయాలపాలై చనిపోయాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
రెండేళ్లు దాటినా అద్దె ఇవ్వడం లేదని, అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నాడని ఓ షాప్ యజమాని తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వేకువజామునే వెళ్లి ఆ షాప్ లో ఉన్న సామగ్రికి నిప్పు పెట్టాడు. అయితే ఆ మంటలు అతడికీ అంటుకోవడంతో గాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. 80 శాతం కాలిన గాయాలతో ఆ యజమాని మరణించాడు. ఈ విషాద ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
KCR: గెలుపు బీఆర్ఎస్ దే.. గతంలో కంటే 5-6 సీట్లు ఎక్కువ గెలుచుకుంటామన్న సీఎం కేసీఆర్
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని దర్శి పట్ణణంలోని కోతమిషన్ బజారులో 45 ఏళ్ల వరప్రసాద్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయనకు కురిచేడులో రెండు షాపులు ఉన్నాయి. ఒక షాపులో ఆయన బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. మరో షాపును ఆవుల శ్రీనివాస్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు. ఆయన టెంట్ హౌస్ సామగ్రిని అందులో ఉంచాడు. అయితే పలు కారణాల వల్ల శ్రీనివాసులు 2020 సంవత్సరం నుంచి వరప్రసాద్ కు అద్దెను ఇవ్వడం లేదు.
కన్నతండ్రిపై 17 ఏళ్ల కుమారుడి దురాగతం.. డబ్బులివ్వలేదని దారుణ హత్య.. భూపాలపల్లిలో ఘటన
అద్దె ఇవ్వాలని యజమాని ఆయనను ఎన్నో సార్లు అడిగాడు. కానీ ఆయన నుంచి సరైన సమాధానం రావడం లేదని వరప్రసాద్ కు కోపం వచ్చింది. దీంతో టెంట్ హౌస్ సామగ్రికి నిప్పు పెట్టాలని భావించాడు. అందుకే ఆదివారం ఉదయం వేకువజామునే ఇంట్లో నుంచి బయలుదేరాడు. 5.30 గంటల ప్రాంతలో శ్రీనివాసులుకు అద్దెకు ఇచ్చిన షాపు వద్దకు చేరుకున్నాడు. దానికి తాళం కూడా లేకపోవడంతో షట్టర్ సులభంగానే తెరిచాడు. అనంతరం లోపల ఉన్న టెంట్ హౌస్ సామగ్రిపై పెట్రోల్ పోశాడు. తరువాత నిప్పు అంటించాడు. అయితే మంటలు ఒక్క సారిగా చెలరేగి అతడికీ అంటుకున్నాయి.
Palla Venkat Reddy: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తోనే పొత్తు : సీపీఐ
దీంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వరప్రసాద్ ను బయటకు తీసుకొని వచ్చారు. అప్పటికే అతడి శరీరానికి 80 శాతం గాయాలు అయ్యాయి. వెంటనే 108 ఆంబులెన్స్ కు సమాచారం అందించారు. అందులో వరప్రసాద్ ను ముందుగా దర్శి సామాజిక వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడి ఆయనను డాక్టర్లు పరీక్షించారు. కానీ అప్పటికే మరణించాడని ప్రకటించారు.
