Hyderabad: వచ్చే శాసన సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తో పొత్తు ఉంటుందని సీపీఐ పార్టీ ప్రకటించింది. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మునుగోడు నియోజకవర్గస్థాయి సమావేశంలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి ఈ విషయం వెల్లడించారు.
CPI Leader Palla Venkat Reddy: వచ్చే శాసన సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తోనే పొత్తు సీపీఐ పార్టీ ప్రకటించింది. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మునుగోడు నియోజకవర్గస్థాయి సమావేశంలో సీపీఐ జాతీ య కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి ఈ విషయం వెల్లడించారు. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకు తెలంగాణలో బీఆర్ఎస్ తో కలిసి ముందుకు నడవాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ పల్లా వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నది మండిపడ్డారు. తొమ్మిదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి, దళిత, గిరిజన ఆదివాసీలపై భౌతిక దాడులు చేస్తూ పరిపాలన సాగిస్తున్నదని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చలేదని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు సహా అనేక విషయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతోందని మండిపడ్డారు.
కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది సీపీఐ. ఈ క్రమంలోనే మునుగోడు సీటు ఎవరికి ఇచ్చినా అంద రూ కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించినట్టు పల్లా పేర్కొన్నారు.
