అమరావతి: కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు.

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్ లో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఏ వైరస్ అయినా కూడ రెండు మూడు సార్లు  వచ్చే అవకాశం ఉందన్నారు. నవంబర్, డిసెంబర్ తర్వాత పరిస్థితిని చూసి నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు. అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేమని ఆయన స్పష్టం చేశారు.
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకొనే వెసులుబాటు ఉందన్నారు మంత్రి.

also read:జగన్ కు విరుగుడు: స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్లాన్ ఇదీ...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

also read:స్థానిక ఎన్నికలపై నిమ్మగడ్డ పిటిషన్: జగన్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై  రాజకీయ పార్టీలతో ఏపీ ఎన్నికల సంఘం ఈ నెల 28వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది.ఎన్నికల నిర్వహణపై రాజకీయపార్టీల సలహాలు తీసుకోనుంది.