భాజపాపై జనల్లో వ్యతిరేకత బాగా ఉందని చంద్రబాబు సమాచారం ఉన్నట్లుంది. అందుకనే మెల్లిగా భాజపాకు దూరం జరిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లే ఉంది.

కేంద్రం ప్రకటిచిన ప్యాకేజికి చట్ట బద్దత కల్పించకపోతే పోరాటం తప్పదని చంద్రబాబు హెచ్చరించటం దేనికి సంకేతాలు? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా పని అయిపోయినట్లేనని చంద్రబాబుకేమన్నా సంకేతాలు వచ్చాయా? ఇప్పుడిదే అంశంపై అందరిలోనూ చర్చ మొదలైంది. ఏపి అభివృద్ధికి కేంద్రం ప్రకటించని ప్రత్యేకప్యాకేజిని పట్టుకుని చంద్రబాబు ఎందుకు ఊగుతున్నారనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. ఎందుకంటే, కేంద్రం ప్రకటిచింది ‘ప్రత్యేకసాయం’. చంద్రబాబు అడుగుతున్నది ‘ప్రత్యేకప్యాకేజి’కి చట్టబద్దత. అసలు ఈ రెండింటికి ఏమన్నా సంబంధం ఉందా.

చట్టసభలన్నా, ఎన్నికల హామీలన్నా నరేంద్రమోడికి ఏమాత్రం విలువ లేదన్న విషయం అర్ధమైపోతోంది. కేంద్రం ప్రత్యేకసాయాన్ని ప్రకటిస్తే, చంద్రబాబు ప్రత్యేకప్యాకేజిని ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారో అర్ధం కావటం లేదు. అందుకనే చంద్రబాబు ఎన్నిసార్లు కేంద్రాన్ని దేబిరించిన పట్టించుకోలేదు. ఇంతకాలమూ మౌనంగా ఉన్న జైట్లీ, వెంకయ్యలు కూడా తాజాగా ఏమంటున్నారు. కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు ఇక ప్రత్యేకంగా చట్టబద్దత అవసరం లేదని. మరి అదే మాటను ప్యాకేజికి చట్టబద్దత కావలని చంద్రబాబు అడిగినపుడే చెప్పవచ్చుకదా?

అంటే అర్ధం అవుతున్నదేమిటి? ప్రత్యేకసాయం ముసుగులో కేంద్రం ఏమి ఇస్తే అది తీసుకోవటం తప్ప రాష్ట్రానికి వేరే గతిలేదు. అవసరం తీరిపోయిన తర్వాత ప్రత్యేకహోదానే తూచ్ అన్నారు. దానికితోడు తానివ్వని ప్యాకేజి హామీని ఎందుకు అమలు చేస్తారు? ఈ విషయాలు చంద్రబాబుకు తెలీవా ? తెలిసీ ఎందుకు నాటాకాలు ఆడుతున్నారంటే కేంద్రం నుండి ఏమీ సాధించలేని చేతకాని తనమే కనబడుతోంది.

ఓవైపు వైసీపీ ప్రత్యేకహోదా కోసం ఎప్పటినుండో ఆందోళనలు చేస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ కూడా మొదలుపెట్టారు. ఇంకో వైపు యువత కూడా బాగానే గళం కలుపుతోంది. దాంతో జనాలను పక్కదోవ పట్టించేందుకు ఇద్దరు నాయుళ్ళు ప్లాన్ చేసారు. ప్రతిపక్షాల ఆందోళన, జనాల గొంతును చంద్రబాబు తొక్కిపడదామనుకున్నారు. అది సాధ్యం కాదని ఇపుడు అర్ధమైనట్లుంది. అందుకే ప్యాకేజికి చట్టబద్దత కల్పించకపోతే కేంద్రంపై పోరాటమంటూ కొత్త కథలు మొదలుపెట్టారు. కేంద్రంపై పోరాటం చేసేంత సీన్ చంద్రబాబుకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ‘ఓటుకునోటు’ కేసున్నంత వరకూ చంద్రబాబు కేంద్రంపై పోరాటం చేయలేరు.

ఇకపోతే, జరుగుతున్న ఐదు రాష్రాల ఎన్నికల ఫలితాలపై చంద్రబాబుకు ముందే ఉప్పందేమో అన్న చర్చ సర్వత్రా మొదలయ్యింది. పంజాబ్, గోవాలో భాజపాకు అధికారం నిలుపుకోవటం కష్టమనే సంకేతాలు కనబడుతున్నాయి. ఇక, యూపిలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయటం అంత వీజీ కాదని అర్ధమవుతోంది. అంటే భాజపాపై జనల్లో వ్యతిరేకత బాగా ఉందని చంద్రబాబు సమాచారం ఉన్నట్లుంది. అందుకనే మెల్లిగా భాజపాకు దూరం జరిగేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లే ఉంది.