అమరావతి: దేశంలో మూడు రాజధానులు ఎక్కడా లేవు.. ఉత్తర్ ప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో కూడ ఒక్కటే రాజధాని ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పారు. ఆ వ్యాఖ్య ద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఝలక్ ఇచ్చారు. 

మంగళవారం నాడు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండదని రామ్ మాధవ్ తేల్చి చెప్పారు.ఒక్క రాజధాని అవినీతిపై ఎలా పోరాటం చేశామో.. మూడు అవనితీ రాజధానులపై కూడ పోరాటం చేయాలని ఆయన కోరారు. 

also read:ఏపీలో అధికారంలోకి రావడం సులభం కాదు: రామ్ మాధవ్

హైద్రాబాద్ లో ఐదేళ్లో పదేళ్లో ఉంటూ రాజధానిని నిర్మాణం చేసుకోవాలని సూచించింది. కానీ ఏ కారణం చేత అప్పటి సీఎం ఇక్కడికి ఎందుకు వచ్చారో మీ అందరికి తెలుసునన్నారు.అమరావతిలోని ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం సాగించాలని ఆయన కోరారు. 

అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే ఆ పార్టీ నేతలు తట్టుకోలేరని ఆయన చెప్పారు. మంచి చేస్తే అంగీకరించాలి, తప్పు చేస్తే మాట్లాడాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.

అమరావతికి బీజేపీ మద్దతును ప్రకటించింది. కానీ, మూడు రాజధానులను ఆ పార్టీ వ్యతిరేకించింది. కానీ, రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏమీ ఉండదని హైకోర్టుకు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్రాలదే అధికారమని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు.