విజయవాడ: విజయవాడ కనకదుర్గ ఆలయానికి చెందిన వెండి రథం నుండి మూడు సింహాల చోరీపై పోలీసులపై ఇంకా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకొంటున్నారు.

ఈ ఏడాది జూన్ 26న రెండు సింహాల విగ్రహాలు, అదే నెల 29వ తేదీన మరో సింహాం విగ్రహాం చోరీకి గురైందని పోలీసులు గుర్తించారు. మరో సింహాం విగ్రహాన్ని కూడ చోరీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ  సాధ్యం కాలేదని పోలీసులు గుర్తించారు.

also read:కనకదుర్గ అమ్మవారి వెండి రథం మూడు సింహాల విగ్రహాలు చోరీ: దర్యాప్తులో పురోగతి

ఈ రథాన్ని పోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. కానీ ఇంతవరకు ఆ టీమ్ నుండి ఎలాంటి సమాచారం రాలేదు. ఈ చోరీ కేసులో ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకొంటున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై ఆలోచిస్తున్నారు.ఈ చోరీ కేసు దర్యాప్తును ఆరు పోలీస్ బృందాలు చేపట్టాయి. 

ఈ మూడు సింహాల విగ్రహాలు చోరీకి గురికావడం ఏపీ రాజకీయాల్లో కలకలానికి కారణమైంది. విపక్షాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతోనే రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో దాడులు చోటు చేసుకొంటున్నాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.