ఏపీకి ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు

next few months ap gets lack of employements
Highlights

  • ఎపీకి లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపిన చంద్రబాబు.
  • వందలాది కంపేనీలు ఇప్పటికే అమరావతికి క్యూ కట్టాయి.
  • ప్రపంచం అంతా అమరావతి వైపు చూస్తుంది.

రాష్ట్రంలో నిరుద్యోగులు ఇక పుల్లు హ్యాపీ. ఎందుకంటే త్య‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి  ల‌క్ష‌లాది ఉద్యోగాలు వ‌చ్చేస్తాయ‌ట‌. అలాగ‌ని చంద్ర‌బాబు నాయుడు ఇవ్వాళ‌ తెలిపారు. యువత ఉద్యోగాల కోసం విదేశాల‌కు, ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయ‌న తెలిపారు. మ‌రో ఆరు నెలల్లో ప్రపంచ స్థాయి కంపేనీలు మన వద్దకే వస్తాయని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు.

 బీఆర్‌శెట్టి ఫార్మాసుటిక‌ల్ సంస్థ శంకుస్థాప‌న‌లో పాల్గోన్న చంద్ర‌బాబు, మీడియాతో మాట్లాడారు. త్వ‌ర‌లో దశల వారీగా వంద‌లాది సంస్థ‌లు ఏపీలో పెట్టెబ‌డులు పెట్ట‌డానికి వ‌స్తున్నాయ‌ని పెర్కొన్నారు. ఇప్ప‌టికే వంద‌ల కోట్ల పెట్టుబ‌డితో అమ‌రావ‌తికి నూత‌న సంస్థ‌లు ప్రారంభ‌మ‌య్యావ‌ని, త్వ‌ర‌లో ల‌క్ష‌ల‌ కోట్ల పెట్టుబడులు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో 27 టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు. తుళ్లూరు, నెక్కళ్లు, అనంతవరంలో గేమింగ్‌, వర్చువల్‌ స్టూడియోలు అమరావతిని నాలెడ్జ్‌‌, మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆయ‌న తెలిపారు.

 త్వ‌ర‌లో గ‌ల్ప్ దేశాల నుండి భారీస్థాయిలో పెట్టుబ‌డులు వ‌స్తున్నాయని అన్నారు. నేరుగా అమరావతి నుంచి ఎమిరేట్స్‌కు విమానం తిరగనుందన్నారు. అమ‌రావ‌తిలో ఇండో-యూకే ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ కంపేనీలు అన్ని ప‌ట్టుబ‌డుల కోసం అమ‌రావ‌తి వైపు చూస్తున్నారని ఆయ‌న తెలిపారు.


  చంద్ర‌బాబు మూడు సంవ‌త్స‌రాలుగా పాల‌న కొన‌సాగిస్తున్నారు, కానీ చెప్పుకోత‌గిన ఉద్యోగాల‌ క‌ల్ప‌న మాత్రం జ‌ర‌గలేదు. కానీ ఇప్పుడు మాత్రం మాత్రం బాబు ల‌క్ష‌లాది ఉద్యోగాలు రాష్ట్రానికి వ‌స్తాయ‌ని చెబుతున్నారు. ఇక చూడాలి రాష్ట్రానికి ఏ స్థాయిలో ఉద్యోగాలు వ‌స్తాయో.. మ‌రి. ఇప్ప‌టికే ఆంధ్ర‌లో ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు. 

loader