Asianet News TeluguAsianet News Telugu

మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: వెలుగులోకి మరిన్ని దిమ్మ తిరిగే విషయాలు

చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో మరిన్ని దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దెయ్యాన్ని వదిలించడానికి అలేఖ్య తన చెల్లె సాయి దివ్యను చంపి, తనను చంపాలని తల్లిని కోరినట్లు తెలుస్తోంది.

New revelations in Madanapalle killings: Alekhya killed Sai divya
Author
Madanapalle, First Published Jan 26, 2021, 9:43 AM IST

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆధునిక కాలంలో విద్యావంతులైన కుటుంబ సభ్యులు ఇంత దారుణంగా వ్యవహరించారా అని దిగ్భ్రాంతి కలిగే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

కూతుళ్లకు దెయ్యం పట్టిందని తల్లి పద్మజ తాంత్రికులను ఇంటికి పిలిపించినట్లు తెలుస్తోంది. తాంత్రికులు వచ్చిన దృశ్యాలు సిసీటీవీలో రికార్డు అయ్యాయి. అయితే, తాంత్రికుల విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఓ తాంత్రికుడు వారి ఇంటి చుట్టూ నిమ్మకాయలు కట్టినట్లు పోలీసులు గుర్తించారు. 

Also Read: ‘చెల్లి ఆత్మను తెస్తాను.. నన్ను చంపమ్మా’.. తల్లి, తండ్రి, కూతురు నగ్నంగా పూజలు చేసి.. !

వాకింగ్ చేసిన సమయంలో తమ కూతుళ్లు మంత్రించిన నిమ్మకాయలు తొక్కారని, దాంతో కూతురికి దెయ్యం పట్టిందని భావించిన తల్లి పద్మజ ఇంటికి తాంత్రికులను పిలిపించినట్లు చెబుతున్నారు.  పద్మజ కూతుళ్లు అలేఖ్య, సాయి దివ్యలకు తాంత్రికులు తాయెత్తులు కట్టి, మెడలో రుద్రాక్ష మాలలు వేశారు. నాలుగు రోజుల పాటు ఇంట్లో క్షుద్రపూజలు చేశారు. 

తనకు దెయ్యం కనిపించిందని పద్మజ చిన్న కూతురు సాయి దివ్య ఆదివారంనాడు కేకలు పెట్టిందని, దాంతో అలేఖ్య సోదరి దివ్యను డంబెల్ తో కొట్టి చంపిందని అంటున్నారు. ఆ తర్వాత దివ్య మృతదేహంతో తండ్రి పురుషోత్తంనాయుడు, తల్లి పద్మజ, సోదరి అలేఖ్య నగ్నంగా పూజలు చేశారు. 

Also Read: మదనపల్లి జంటహత్యల కేసు : ‘నలుగురం కలిసి మళ్లీ పుడతాం..’ కొత్త ట్విస్ట్

చనిపోయిన తన చెల్లెను బతికించడానికి అలేఖ్య తన ప్రాణం తీయాలని కోరింది. దీంతో పద్మజ అలేఖ్య నోటిలో నవధాన్యాలు పోసిన కలశాన్ని పెట్టి, డంబెల్ తో కొట్టి చంపింది. పురుషోత్తంనాయుడు, పద్మజ ఇంకా వారి ఇంట్లోనే పోలీసుల కాపలాలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios