‘చెల్లి ఆత్మను తెస్తాను.. నన్ను చంపమ్మా’.. తల్లి, తండ్రి, కూతురు నగ్నంగా పూజలు చేసి.. !
తండ్రి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్. తల్లి పట్టణంలోనే పేరొందిన మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థ కరస్పాండెంట్. ప్రస్తుతం అందులో 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాతికేళ్ల క్రితమే వీరు మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. ఉన్నత విద్యావంతులుగా చుట్టుపక్కల మంచి పేరు సంపాదించారు. కూతుర్లిద్దరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నారు.
తండ్రి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్. తల్లి పట్టణంలోనే పేరొందిన మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థ కరస్పాండెంట్. ప్రస్తుతం అందులో 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాతికేళ్ల క్రితమే వీరు మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. ఉన్నత విద్యావంతులుగా చుట్టుపక్కల మంచి పేరు సంపాదించారు. కూతుర్లిద్దరినీ ఉన్నత చదువులు చదివిస్తున్నారు.
వారం క్రితం వరకూ తోటి అధ్యాపకులు, స్థానికులతో కలిసి మెలిసి ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. చిన్న కుమార్తెలో మొదలైన మనో వ్యాకులత ఇంటిల్లిపాదిని మూఢత్వంలోకి నెట్టేసింది.
చదువుకున్నవారైనా మూఢులుగా మారారు. విచక్షణ కోల్పోయి వ్యవహరించారు. దెయ్యం వదిలిస్తామంటూ.. ఒకరివెంట ఒకరిని ఇద్దరు బిడ్డలను తల్లిదండ్రులే కొట్టి చంపి బలి తీసుకున్నారు. కనిపెంచిన చేతులతోనే కడతేర్చారు.
చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం శివనగర్ లో ఆదివారం రాత్రి వెలుగుచూసిన అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు పాతికేళ్ల కిందట శివనగర్ లో మూడంతస్తుల ఇల్లు కట్టుకున్నారు. అందులో వీరి ఒక్క కుటుంబమే నివసిస్తోంది. తల్లిదండ్రులు, పిల్లలు అలేఖ్య(27), సాయిదివ్య (22) ఇంట్లో తరచూ ఆధ్యాత్మిక విషయాలే చర్చించుకునేవారు. తలనొప్పి వచ్చి తగ్గిపోయినా అది బాబా దయవల్లేనని భావించేవారు.
రోజంతా ఉపవాసం ఉన్నా.. ఆకలి లేకపోవడానికి బాబా ఆశీస్సులే కారణమనేవారు. పద్మజ ఫేస్ బుక్ నిండా ఆధ్యాత్మిక పోస్టులే ఉన్నాయి. పురుషోత్తం తరచూ ఆధ్యాత్మిక, తాంత్రిక విషయాలున్న పుస్తకాలే చదివేవారు. వారం క్రితం అలేఖ్య, సాయిదివ్య పెంపుడు కుక్కను వాకింగ్ తీసుకెళ్తూ మూడు రోడ్ల కూడలిలో వేసిన ముగ్గులో ఉంచిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ తొక్కారు. ఈ విషయం తిరిగి వచ్చాక తల్లిదండ్రులకు చెప్పారు. తమకు ఏమైనా అవుతుందేమోనని యువతులిద్దరికీ భయం పట్టుకుంది.
ఆ రోజు నుంచి ఆదివారం వరకూ అలేఖ్య పూర్తిగా మౌనంగా ఉంటోంది. ఇంట్లో దెయ్యాలున్నాయని సాయి దివ్య తల్లిదండ్రులకు చెప్పేది. బాత్రూంకు వెళ్లాలన్నా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. తమను ఇంట్లోంచి తీసుకెళ్లాలని ఓ టీచర్ న అడిగారు. ఆయన సర్ది చెప్పి వచ్చారు. ఆ తరువాత తమిళనాడుకు చెందిన ఓ మంత్రగాడిని సంప్రదించి తాయత్తు చేయించుకున్నారు. వారం రోజులుగా పురుషోత్తం నాయుడు, పద్మజ ఆఫీసులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు.
ఆదివారం మద్యాహ్నం ఇంట్లో పూజలు చేస్తుండగా పై అంతస్తులో ఉన్న సాయి దివ్య మ్యూజిక్ వాయిస్తూ ఉన్నట్టుండి కేకలేసింది. మానసిక రోగిలా ప్రవర్తించింది. తల్లిదండ్రులు, సోదరి ముగ్గురూ కలిసి ఆమెను దయ్యం ఆవహించిందని డంబెల్ తో గట్టిగా కొట్టారు. వెంటనే ఆమె ప్రాణాలు విడిచింది. వారం తర్వాత నోరు విప్పిన అలేఖ్య మృతదేహం నుదుటిపై ముగ్గులు వేసి చెల్లెలి ఆత్మ బయటకు వెళ్లకుండా బంధించానంటూ చెప్పింది. ఆమెను బతికించుకుని తెచ్చేందుకు తననూ చంపాలని తల్లిని కోరింది.
ముగ్గరూ నగ్నంగా ఇంట్లో పూజలు చేశారు. అలేఖ్యను పూజగదిలోకి తీసుకెళ్లి నోట్లో చిన్న రాగి కలశాన్ని పెట్టి, అందులో నవధాన్యాలు పోసి.. తలపై డంబెల్ తో గట్టిగా కొట్టారు. దీంతో ఆమె కూడా అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత వారి స్మార్ట్ ఫోన్లను పగలగొట్టారు.
సాయంత్రం 4.30 గంటలకు ఈ దారుణం జరిగింది. రాత్రి 7 గంటలకు పురుషోత్తం తన సహచర అధ్యాపకుడికి ఈ విషయం చెప్పాడు. ఆయన వచ్చి చూడగా.. ఇద్దరు కూతుళ్లు శవాలుగా రక్తపు మడుగులో పడి ఉండగా.. తల్లిదండ్రులు క్షుద్రపూజల్లో నిమగ్నమయ్యారు.
మదనపల్లె డీఎస్పీ రవి మనోహరచారి, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాల తరలింపునకు తల్లి పద్మజ అడ్డుపడింది. ‘నేనే పార్వతిని.. కాళికను. బిడ్డలిద్దరూ పుణ్యలోకాల్లో ఉన్నారు. సోమవారం ఉదయాన్నే బయటకు తీసుకొస్తానంటూ’ అరిచింది. పోలీసులు వారిని కట్టడి చేసి.. అర్థరాత్రి తర్వాత శవాలను మార్చురీకి తరలించారు. మధ్యాహ్నం పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను పెద్ద తోపులో అంత్యక్రియలు పూర్తి చేశారు. తలకొరికి పెట్టేందుకు తండ్రిని ఇంటి నుంచి బైటికి తీసుకొచ్చారు. నిందితులను వారి ఇంట్లోనే విచారిస్తున్నారు.