Asianet News TeluguAsianet News Telugu

మదనపల్లి జంటహత్యల కేసు : ‘నలుగురం కలిసి మళ్లీ పుడతాం..’ కొత్త ట్విస్ట్

మూఢనమ్మకాలతో కన్నకూతుళ్లిద్దర్నీ అతికిరాతకంగా బలి ఇచ్చిన మదనపల్లి జంట హత్యల కేసులో మరో షాకింగ్‌ ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. మదనపల్లెలోని శివనగర్‌లో నివాసం ఉంటున్న ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ వల్లేరు పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు ఆదివారం రాత్రి తమ కుమార్తెలైన అలేఖ్య (27), సాయిదివ్య (22)లను పూజల పేరుతో కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. 

new twist in madanapalle two children assassination case - bsb
Author
Hyderabad, First Published Jan 26, 2021, 7:12 AM IST

మూఢనమ్మకాలతో కన్నకూతుళ్లిద్దర్నీ అతికిరాతకంగా బలి ఇచ్చిన మదనపల్లి జంట హత్యల కేసులో మరో షాకింగ్‌ ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. మదనపల్లెలోని శివనగర్‌లో నివాసం ఉంటున్న ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ వల్లేరు పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు ఆదివారం రాత్రి తమ కుమార్తెలైన అలేఖ్య (27), సాయిదివ్య (22)లను పూజల పేరుతో కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. 

కూతుళ్లను బలి ఇచ్చిన తరువాత తల్లిదండ్రులు కూడా బలిదానం చేసుకోవాలని భావించారట. అయితే విషయం లీక్ అయి పోలీసులు రావడంతో ఆ ప్లాన్‌ బెడిసికొట్టినట్టు వారిద్దరూ తీవ్రంగా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని గంటలు ఆలస్యమైతే ఆ ఇద్దరూ కూడా మరణించి ఉండేవారని సమాచారం.

పిల్లలిద్దర్నీ చంపిన తల్లిదండ్రులు అనంతరం వారు కూడా బలిదానం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలా చేయడం వల్ల నలుగురూ కలిసి మరోసారి జన్మిస్తామనేది వీళ్ల మూఢ నమ్మకం. ఈ విషయాల్ని పురుషోత్తం నాయుడు తన సహోద్యోగి ఒకరికి ఫోన్‌ చేసి చెప్పాడు. తాము కూడా మరికొద్దిసేపట్లో చనిపోతామని, ఆ అద్భుతాన్ని వచ్చి చూడాలని ఫోన్‌లో కోరినట్టు తెలిసింది. 

వెంటనే మేల్కొన్న సహోద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చనిపోవడానికి సిద్ధంగా ఉన్న పురుషోత్తం నాయుడు, పద్మజలను అదుపు చేశారు. తల్లి పద్మజ మాత్రం తన బిడ్డలు బతికి వస్తారని.. పోలీసులు, ప్రజలు అనవసరంగా ఆందోళనపడుతున్నారని వాదిస్తోంది.  

సోమవారం ఉదయం పురుషోత్తం నాయుడును పరామర్శించేందుకు వచ్చిన స్నేహితుడు, సహోద్యోగి జె.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. స్నేహితుడి అభివృద్ధిని ఓర్వలేని వ్యక్తులెవరో కుటుంబాన్ని ఊబిలోకి దించి ఈ ఘాతుకం చేయించారన్నారు. ఎంతో దైవభక్తి కలిగిన వ్యక్తులు వారి బిడ్డల్ని ఇంత కర్కశంగా హత్య చేశారంటే నమ్మలేమని.. దీనివెనుక ఎవరోఉన్నారని ఆరోపించారు. ఇదిలావుండగా అలేఖ్య, సాయిదివ్య మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios