వేమన పద్యంతో మునిసిల్ హెల్తాఫీసర్ మీద దాడి చేసిన కార్పొరేటర్ వహీదా  పనిచేయలేని ఆఫీసర్ ను తొలగించాలని సభలో  బైఠాయింపు  రూలింగ్ పార్టీ కార్పొరేటర్ తిరుగుబాటుతో గందరగోళంలో పడిపోయిన తెలుగుదేశం పార్టీ

నెల్లూరులో పట్టణం లోని 36వ డివిజన్ కార్పొరేటర్ ఎస్ కె వహిద కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వెంకట రమణ తీసేయాలని ఈ రోజు కార్పొరేషన్ మీటింగ్ లు సంచలనం సృష్టించారు. అధికార తెలుగుదేశం పార్టీ కి చెందిన వహీదా ఇలా మునిసిపాలిటీ పాలననుఎండగట్టడం మేయర్ తో అధికారులందరిని తెగ ఇబ్బంది పెట్టింది.

తక్షణం అతన్ని విధుల్లో నుంచి తప్పంచాలని డిమాండ్ చేస్తూ ఆమె హాలు మధ్యలో కూర్చుండి పోయారు. ప్లకార్డు ప్రదర్శించారు.

 ఈ రోజు బడ్జెట్ సమావేశం ప్రారంభం కాగానే వెంటనే హెల్త్ ఆఫీసర్ వెంకటరమణపైవైఫల్యం గురించి ప్రస్తావిసక్తూ ప్లకార్డు పట్టుకొని ఆమె నిరసన తెలియజేశారు.

మేయర్ పోడియం ముందు బైటాయించారు. చర్యలు తీసుకుంటున్నట్లు తక్షణం ప్రకటన చేయాలని కూడా పట్టుబట్టారు.

గడచిన మూడేళ్ల నుండి తన డివిజన్ లో పారిశధ్యత అధ్వాన్నంగా ఉందని, చెత్త తరలించే చర్యలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్ కు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఈ విమర్శులను,ఫిర్యాదులను ఖాతరు చేయడంలేదుని ఇదంతా దున్నపోతుపై వర్షం పడినట్లుగా ఆయన భావిస్తున్నారని అన్నారు.

ఈ తీవ్ర విమర్శకు స్పందించిన మేయర్ అబ్దుల్ అజీజ్ హెల్త్ ఆఫీసర్ తీరు మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

వహీదా తిరుగుబాటుతో అధికార తెలుగుదేశం గందరగోళంలో పడింది. టిడిపి సభ్యులు ఆమె బైఠాయించిన చోటికి వచ్చి
బతిమాలి సర్దిచెప్పగా ఆందోళనవిరమించేందుకు అతికష్టం మీద వహీదా అంగీకరించారు. అయితే, హెల్త్ ఆఫీసర్ మీద చర్య తీసుకునేవిషయంమీద ప్రటకచేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈయన వైఫల్యం వల్ల నెల్లూరులో డ్రయిన్లన్నీ పొర్లిపోతున్నాయని, నగరం పాడయిపోతున్నదని ఆమె చప్పారు.

వేమన పద్యాలు వినిపించి చెప్పగ చెప్పగా ఒక ఏడాది కయినా దున్నపోతు మాటలు వ వింటుందేమో గాని హెల్త్ ఆఫీసర్ లాంటి మూర్ఖులకు ముప్పేళ్లు చెప్పినా అర్థం కాదు అని అన్నారు. ఇలాంటి వాళ్లుంటారని ఆరోజులలోనే వేమన వూహించి రాశాడని ఆమె అనగానే సభలో ఉన్నవారంతా బల్లలుచరిపి అభినందించారు.