జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మరో కోర్టుకు: తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్
ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును కోరారు.
హైదరాబాద్: ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
also read:జగన్‌కు జైలా.. బెయిలా, సస్పెన్స్‌కు పడని తెర.. తీర్పు మరోసారి వాయిదా
జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ లను రద్దు చేయాలని రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. దీనిపై సీబీఐ కోర్టు రేపు తుది ఆదేశాలు ఇవ్వనుంది.ఈ తరుణంలో వేరే న్యాయస్థానానికి ఈ పిటిషన్ ను బదిలీ చేయాలని రఘురామకృష్ణం రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అంతేకాదు సీబీఐ కోర్టు రేపు తుది ఉత్తర్వులు జారీ చేయకుండా కూడా ఆదేశాలివ్వాలని కోరారు.ఈ పిటిషన్ పై విచారణను ఇతర క్రిమినల్ కోర్టులకు బదిలీ చేయాలని రఘురామకృష్ణంరాజు ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు.