జగన్‌కు జైలా.. బెయిలా, సస్పెన్స్‌కు పడని తెర.. తీర్పు మరోసారి వాయిదా
వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పును సీబీఐ కోర్ట్ వచ్చే నెల 15కి వాయిదా వేసింది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును నాటినుంచి కోర్టు రిజర్వు చేసింది.
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టు తీర్పును వచ్చే నెల 15కి వాయిదా వేసింది. అయితే కొద్దిరోజుల నుంచే జగన్‌కు జైలా.. బెయిలా? అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏ ఇద్దరు కలిసినా దీని గురించే చర్చించుకోవడంతో పాటు న్యూస్ ఛానెళ్లలో పెద్ద ఎత్తున డిబేట్లు జరగడంతో తీర్పుపై తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే ఈ ఉత్కంఠకు బుధవారం కూడా తెరపడలేదు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి.
అయితే తీర్పును నాటినుంచి కోర్టు రిజర్వు చేసింది. ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు. సీఎం హోదాలో జగన్ వివిధ కారణాలు చెబుతూ, కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని రఘురామ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న అనంతరం తీర్పును వచ్చే నెల 15కి వాయిదా వేసింది కోర్ట్.