ఏలూరు: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కార్యాలయం పేరును మార్చారు. శుక్రవారం నాడు కార్యాలయం పేరును మార్చారు.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కి భీమవరంలో కార్యాలయం పేరుంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారు.ఫ్లెక్సీలో ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఫోటోలను కూడ తొలగించారు.

also read:జగన్ ప్రభుత్వంపై రఘురామకృష్ణమ రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు

గతంలో ఈ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నరసాపురం పార్లమెంట్ సభ్యుల వారి కార్యాలయం అని రాసి ఉండేది. ఈ పేరును యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారు.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీలు  స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.

పార్లమెంట్ లోపల, బయట కూడ న్యాయవ్యవస్థపై దాడి జరుగుతోందని  రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.ఇవాళ ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇతర ఎంపీలతోనే తనను కొట్టిస్తారని  నీచంగా మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

కొంత కాలంగా వైసీపీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు కొరకరానికొయ్యగా మారాడు. రోజూ ఏదో విషయమై మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఉంటూ రఘురామకృష్ణంరాజు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.