నారా లోకేష్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. వైసీపీ, టీడీపీ వర్గాల్లో చర్చ..
నరసరావుపేట ఎంపీ, వైసీపీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ నాయకుడు నారా లోకేష్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. యువ ఎంపీ టీడీపీలో చేరబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి.
వైసీపీ యువ నాయకుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ను కలిశారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది ఇప్పుడు వైసీపీ, టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరుతున్నారనే గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా ఇలాంటి వార్తలే వెలువడితే దానిని యువ ఎంపీ ఖండిచారు.
అమానవీయం.. గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన..యూపీలో ఘటన, నిందితుల అరెస్టు
చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు గురువారం చనిపోయారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకువచ్చారు. దీంతో అక్కడికి అనేక మంది రాజకీయ ప్రముఖులు, స్థానికులు వచ్చి నివాళి అర్పించారు. ఇదే క్రమంలో టీపీడీ నాయకుడు నారా లోకేష్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగానే ఇక్కడ ఓ ఆస్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.
ముగిసిన ప్రధాని మోడీ ప్రాన్స్ పర్యటన.. ఫ్రెంచ్-ఇండియా స్నేహం చిరకాలం కొనసాగుతుందంటూ మాక్రాన్ ట్వీట్
బీఎస్ రావు మృతదేహానికి నివాళి అర్పించి ఎంపీ బయటకు వచ్చారు. అదే సమయంలో నారా లోకేష్ లోపలికి వెళ్తున్నారు. దీంతో ఎంపీ అక్కడ ఆగిపోయాడు. లోకేష్ చుట్టూ ఉన్న జనాలను దాటుకొని వెళ్లి ఆయన చేయిలో చేయి కలిపారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. తరువాత అక్కడున్న ప్రజలకు నమస్కారం చేస్తూ లోకేష్ వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ఎంపీ కూడా తన దారిన తాను వెళ్లిపోయాడు. ఈ పరిణామాన్ని అక్కడున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు తమ సెల్ ఫోన్ లలో వీడియో తీశారు.
వీటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో, అవి వైరల్ గా మారాయి. దీంతో ఎంపీ లావు టీడీపీలో చేరుతారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోలు అటు వైసీపీలో, ఇటు టీడీపీలో చర్చకు దారి తీశాయి. అయితే అంత్యక్రియల సందర్భంగా అక్కడి వచ్చారు కాబట్టి ఇరువురి నేతలు రాజకీయాలు పక్కన పెట్టి పలకరించుకున్నారని, దీనిని రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముందని వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు.
కునో నేషనల్ పార్క్ లో మరో చిరుత మృతి.. ఐదు నెలల్లో 8వ మరణం.. ఏడో పులి చనిపోయిన కొద్ది రోజుల్లోనే ఘటన
కాగా.. గతంలోనే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి చేరబోతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఆయన చంద్రబాబు నాయుడితో చాలా సీక్రెట్ గా భేటీ అయ్యారని పుకార్లు వచ్చాయి. కానీ ఇదంతా అబద్దమని ఎంపీ క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరినీ కలవలేదని, పార్టీ మారబోనని ఆయన తెలిపారు. టీడీపీ అధినేతను కలిశానని వచ్చిన వార్తలు అసత్యమని స్పష్టం చేశారు.