గుఢాచారి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన లోకేష్

First Published 6, Aug 2018, 9:38 AM IST
naralokesh praises adavi sheshu starreer gudachari movie
Highlights

చిత్రాన్ని మంత్రి నారా లోకేష్ వీక్షించారు. అనంతరం చిత్ర టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ట్వీట్ చేశారు. 

అడవిశేష్, శోభితా ధూళిపాళ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం గుఢాచారి. కిరణ్ తిక్క ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.  ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. జేమ్స్ బాండ్ తరహాలో తెరెకెక్కిన ఈ  సినిమా సాధారణ ప్రేక్షకులతోపాటు ప్రముఖులను కూడా ఆకట్టుకుంది.

ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించగా.. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఈ సినిమాపై కామెంట్ చేశారు.  ఈ చిత్రాన్ని మంత్రి నారా లోకేష్ వీక్షించారు. అనంతరం చిత్ర టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ట్వీట్ చేశారు. ‘‘గూఢచారి స్ర్పై థ్రిల్లర్ చిత్రం చూసి బాగా ఎంజాయ్ చేశాను. అందరూ చాలా కష్టపడ్డారు. అడవి శేష్, శోభిత ధూళిపాళ, ప్రకాశ్ రాజ్, శశికిరణ్ ఇంకా ఇతర తారాగణం మొత్తం మంచి ఎఫర్ట్ పెట్టారు. వారందరికీ నా అభినందనలు’’ అంటూ నారా లోకేష్ తన ట్విట్టర్‌లో ట్వీటారు.

loader