Asianet News TeluguAsianet News Telugu

ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్న... తమ పనేనన్న బెంజ్ మంత్రి: నారా లోకేష్

 ఈఎస్ఐ స్కాంలో టిడిపి నేత కింజరాపు అచ్చెన్నాయుడిని కక్షసాధింపులో భాగంగా ఇరికించారని మాజీ మంత్రి లోకేష్ పేర్కోన్నారు. 

nara lokesh comments on ESI Scam
Author
Amaravathi, First Published Oct 8, 2020, 12:08 PM IST

గుంటూరు: ఈఎస్ఐ స్కాంతో ఎలాంటి సంబంధం లేకపోయిన మాజీ మంత్రి, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని ఇందులో ఇరికించారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా బెంజ్ మంత్రి జయరాం ఒప్పుకున్నారని లోకేష్ అన్నారు. 

''ఈఎస్ఐ స్కాంలో టిడిపి నేత కింజరాపు అచ్చెన్నాయుడు గారిని కక్షసాధింపులో భాగంగా ఇరికించారని మేము మొదటినుండి చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు స్వయంగా మంత్రి జయరాం గారే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు గారిని ఇరికించా అని అంగీకరించారు'' అంటూ ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసిన కధనానికి సంబంధించిన వీడియోను జతచేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. 

read more  బెంజీకారు వివాదం: మంత్రి జయరాంపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన అయ్యన్నపాత్రుడు

''బెంజ్ మంత్రి గారి పేకాట మాఫియా, ఈఎస్ఐ స్కాం, భూదందా ఆధారాలతో సహా బయటపెట్టాం. మరి చర్యలెక్కడ వైఎస్ జగన్ గారు?'' అని ముఖ్యమంత్రిని నిలదీస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios