మంత్రి ని అడ్డుకున్నా  స్థానికులు. తమ సమస్యలను తీర్చీని తరువాత వచ్చి ఓట్లు అడగమని డిమాండ్ ఎమీ చెయ్యలేక వెనుదిరిగి మంత్రి అఖిల ప్రయ 

మంత్రి అఖిల ప్రియకు నంద్యాల ప్రజలు షాకిచ్చారు. నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భూమా కుటుంబం పై ప్రజలు తమ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. ప్ర‌చారం కోసం వెళ్లినా భూమా అఖిలకు, సోద‌రుడు విఖ్యాత రెడ్డికి స్థానికులు నిల‌దీశారు.


 ప్ర‌చారం లో భాగంగా మంత్రి అఖిల ప్రియా, తన సోద‌రుడు తో క‌లిసి గడిపాడు 9 వార్డు లో ప్రచారానికి వెళ్లారు. త‌మ అభ్య‌ర్థి భూమనా బ్ర‌హానంద రెడ్డికి ఓట్లు వెయ్యాలంటు అభ్య‌ర్థించారు. స్థానిక ప్ర‌జ‌లు అఖిల ప్రియ చుట్టు చేరి, ఆమెను నిల‌దీశారు. ఎన్నిక‌ల్లో ఓట్లేసి గెలిపించినా ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌ సమస్యలు తీర్చ‌లేదంటు ఆమెను ప‌శ్నించారు. అభివృద్ధి చేస్తారని ఓట్లేస్తే న్యాయం జరగలేదంటూ భూమా అఖిలప్రియను అడ్డుకున్నారు. సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. తమని "గెలిపించి ఇంత కాలం అయినా ఇప్పటికీ సమస్యలు అలానే ఉన్నాయ‌ని వారు వాదించారు'. 'మీరు చేసినా అభివృద్ధి ఏంటి?' 'టీడీపీ హయాంలో త‌మ‌కి అన్యాయం జరిగినా ఎందుకు స్పదించలేదని' ప్ర‌జ‌లు ఆమెను నిల‌దీశారు. తమ సమస్యలు తీర్చిన తరువాత వచ్చి ఓట్లను అడగాల్సిందిగా ప్రజలు మంత్రిని డిమాండ్ చేశారు.


 దీనితో మంత్రి ఏం చేయాలో పాలుపోలేదు, స్థానికులను న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ప్ర‌జ‌లు మంత్రిని, త‌న సోద‌రుడిని వాదించ‌డంతో ప్ర‌చారం చెయ్య‌కుండానే తిరుగు ముఖం ప‌ట్టారు. వీరితో పాటు వ‌చ్చిన టీడీపీ నేత‌ల‌ను కూడా స్థానికులు నిలదీశారు. తమ సమస్యలు తీర్చిన తర్వాత ఓట్ల కోసం తమ కాలనీలకు రావాలంటూ మహిళలు తేల్చిచెప్పి అఖిలప్రియకు ఒకింత షాక్ ఇచ్చిన‌ట్లైంది.