నంద్యాల ఉప ఎన్నిక ను రద్దు చేయాలని డిమాండ్ మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వందలాది కోట్లు ధన ప్రవాహాం కొనసాగుతుందని ఆరోపణ.
నంద్యాల ఉప ఎన్నికను మాజీ కేంద్ర మంత్రి సూర్యప్రకాశ్ రెడ్డి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపి, టీడీపీ పార్టీలు వందల కోట్ల రూపాయలు పంచుతున్నారని, తక్షణమే నంద్యాల ఎన్నికను రద్దు చెయ్యాలని అన్నారు. ఒక మీడియా కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన నంద్యాల ఎన్నిక గురించి మాట్లాడారు.
అభ్యర్థుల గెలుపు కోసం పార్టీలు డబ్బు వరదలా పారుతున్నాయని కోట్ల విమర్శించారు. రాయలసీమలో నీరు లేకపోయినా డబ్బు ప్రవాహం ఆగడం లేదని ఆయన విమర్శించారు. ఈ విషయం పై ఈసీ జోక్యం చేసుకోవాలని, తక్షణమే నంద్యాల ఉప ఎన్నికను రద్దు చేయాలని కోట్లా సూర్యప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
