Asianet News TeluguAsianet News Telugu

‘నారా’వారి పల్లె కన్నీరు పెడుతుందో...

నవంబర్ 8 నుంచి సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి  కన్నీరు పెడుతుంది.. కనిపించని కరెన్సీని చూసి... పనే దొరకని పరిస్థితిని చూసి.. అయితే రాష్ట్రాన్ని డిజిటల్ మయం చేయడంలో బీజీగా ఉన్న హైటెక్కు సీఎంగారికి తాను పుట్టిన ఊళ్లోని పుట్టెడు కష్టాలు కనిపించడం లేదు.

naidus own village facing cashless troubles

 

మింగమెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు.

 

రాష్ట్రాన్ని  క్యాష్ లెస్ చేస్తా.. దేశానికే ఆదర్శంగా నిలుస్తానంటూ చెబుతున్న సీఎం గారి గురివింద గింజ నీతులు ఆయన ఊరికి వెళితే కానీ వెలుగులోకి రాలేదు.

 

రాష్ట్రాన్ని డిజిటల్ ఎకానమీగా ఎలా మార్చాలో సూచనలిస్తున్న బాబు... తాను పుట్టిన ఊరు నారావారి పల్లెలో పరిస్థితిని ఒక్కసారి కూడా గమనించలేదనుకుంటా.

 

నవంబర్ 8 నుంచి నారావారిపల్లి నిజంగా కన్నీరు పెడుతుంది.. కనిపించని కరెన్సీని చూసి... పనే దొరకని స్థితిని చూసి.

 

ఆ ఊళ్లో బ్యాంకు కాదు కదా... కనీసం ఒక్క ఏటీఎం కూడా లేదు...  హైటెక్కు సీఎం సొంత గ్రామంలోనే కాదు  ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల పరిస్థితి కూడా ఇంతే.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత  గ్రామవాసులు పడరాని పాట్లు పడుతున్నారు. ఊరి నుంచి దాదాపు 10 కిలోమీటర్ల  వెళితేగాని ఏటీఎంలు కనిపించవు.
 

ఊళ్లో ఉన్న ఒక్క రేషన్ షాపులో  మాత్రమే ఎలక్ట్రానిక్ పద్ధతిలో సబ్సిడీ బియ్యాన్ని, నిత్యావసర వస్తువులను అమ్ముతున్నారు.

 

నారావారిపల్లికి  దగ్గర్లో ఉన్న రంగంపేటలో ఒక ఏటీఎం అయితే ఉంది. కానీ, ఇప్పుడు అది కూడా పనిచేయడం లేదు.

 

తిరుపతిలో  జరుగుతున్న ఇండియన్ సైన్సు కాంగ్రెస్ సదస్సులో మాట్లాడుతూ... దేశాన్ని ఎలా డిజిటల్ మయం చేయాలో ప్రపంచానికి చెబుతున్న బాబుగారు అక్కడికి దగ్గర్లో ఉన్న తన ఊరి సమస్యను మాత్రం పట్టించుకోవడమే లేదు.

 

Follow Us:
Download App:
  • android
  • ios