పోలవరంపై వెనక్కు తగ్గిన చంద్రబాబు

పోలవరంపై వెనక్కు తగ్గిన చంద్రబాబు

పోలవరం టెండర్లపై చంద్రబాబునాయుడు వెనక్కు తగ్గారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవటంతోనే రాష్ట్రప్రభుత్వం వెనక్కు తగ్గినట్లైంది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా స్పిల్ వే, స్పిల్ వే ఛానల్ పనుల కోసం ఇటీవలే రాష్ట్రప్రభుత్వం టెండర్లు పిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని కేంద్ర తప్పుపట్టింది. అంతర్జాతీయ టెండర్లు పిలిచినపుడు 45 రోజులు గడువు ఇవ్వాల్సుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 18 రోజులే గడువిచ్చింది. దాంతో కేంద్రం బాగా సీరియస్ అయ్యింది.

ఈరోజు మంత్రివర్గంలో ఆ విషయంపైనే చర్చ జరిగింది. టెండర్ల ప్రక్రియను రద్దు చేయటమే మంచిదని మంత్రివర్గం నిర్ణయించటంతో టెండర్ల ప్రక్రియను రద్దయింది. అంతేకాకుండా పోలవరం పనులను వేగవంతం చేయటం కోసం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్ స్ట్రాయ్ కి నెల రోజుల గడువు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రమంత్రే స్వయంగా జోక్యం చేసుకున్న తర్వాత రాష్ట్రప్రభుత్వానికి చేయటానికి ఏం లేకపోయింది. అందుకే నెల రోజుల గడువు తర్వాత టెండర్ల ప్రక్రియ గురించి ఆలోచించవచ్చని మంత్రివర్గం నిర్ణయించింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos