‘‘సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకుని వృద్ధులకు ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని కేంద్రమే భరించాలి’’...ఇది ఢిల్లీలో చంద్రబాబునాయుడు తాజా వేడుకోలు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసారు. సామాజిక భద్రతకు కేంద్రం ఇస్తున్న పింఛన్ సరిపోవటం లేదన్నారు. కాబట్టి పింఛన్ మొత్తాన్ని కేంద్రమే భరించాలన్నారు.

ఇదంతా బాగానే ఉంది. గడచిన మూడున్నరేళ్ళల్లో ప్రభుత్వం అందచేస్తున్న వివిధ పింఛన్లను తమ ప్రభుత్వమే ఇస్తోందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా? ఏ పింఛన్లో అయినా కేంద్రం వాటా కూడా ఉంటుందన్నది వాస్తవం. అయితే, ఏ రాష్ట్రప్రభుత్వం కూడా ఆ విషయాన్ని విడమరచి చెప్పదు. పెంచిన పింఛన్ మొత్తం తన ఘనతగానే చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అందుకే ఏ బహిరంగసభలో మాట్లాడినా తాను అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని ఐదు రెట్లు పెంచానని మహా గొప్పగా చెప్పుకుంటున్నారు. నిజానికి పింఛన్ మొత్తం పెరిగింది వాస్తవమే కానీ అందులో కేంద్రం వాటానే ఎక్కువ. లబ్దిదారులకు అవన్నీ అనవసరం కాబట్టి ఎప్పుడూ ఆలోచించరు.
సరే, ప్రస్తుత విషయానికి వస్తే, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి చాలా ఇబ్బందుల్లో ఉంది. దుబారాను తగ్గించుకోవాల్సిన ముఖ్యమంత్రి ఆడంభరాలకు పోతుండటంతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దాంతో ఒక్కోనెలలో ఉద్యోగుల జీతబత్యాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నది. ఇటువంటి నేపధ్యంలోనే దండగమారి ఖర్చులను తగ్గించుకోవటానికి ఇష్టపడని చంద్రబాబు సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనదైన వృద్ధాప్య పింఛన్ భారాన్ని కేంద్రం భరించాలని విజ్ఞప్తి చేయటం విచిత్రంగా ఉంది.
అంటే పింఛన్ విడుదలకు కూడా డబ్బులు సర్దుబాటు కావటం లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇపుడే పరిస్ధితి ఇలాగుంటే 2019 ఎన్నికలు దగ్గర పడితే పరిస్ధితి ఇంకెలాగుంటుందో? సరే, ఎలాగూ వెళ్ళారు కాబట్టి టిడిపిలో సేవా టిక్కెట్లు, కాటేజీలపై 5 శాతం జిఎస్టీ పన్నును రద్దు చేయాలని కూడా అడిగారు. మరి, జైట్లీ ఏమన్నారో మాత్రం తెలీదు.