రెండుసార్లూ సిఎం చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలు జాతీయ స్ధాయిలో వివాదాస్పదమయ్యాయి. రాష్ట్రంలోని జాతి మీడియా పెద్దగా ఫోకస్ చేయకపోయినా జాతీయ మీడియా మాత్రం రెండు సార్లు చంద్రబాబు మాట్లాడిన మాటలను ఉతికి ఆరేసింది.
చంద్రబాబునాయుడు ముచ్చటగా మూడోసారి మూడో రౌండ్ వేయటానికి సిద్దపడుతున్నారు. నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకుమునుపే రెండుసార్లు చంద్రబాబు టూర్ చేసారు. రెండుసార్లూ సిఎం చేసిన వ్యాఖ్యలు, మాట్లాడిన మాటలు జాతీయ స్ధాయిలో వివాదాస్పదమయ్యాయి. రాష్ట్రంలోని జాతి మీడియా పెద్దగా ఫోకస్ చేయకపోయినా జాతీయ మీడియా మాత్రం రెండు సార్లు చంద్రబాబు మాట్లాడిన మాటలను ఉతికి ఆరేసింది. ఒకసారి పుత్రరత్నం, మంత్రి నారా లోకేష్ కూడా పర్యటించేసారులేండి అది వేరే సంగతి.
ఇక, అసలు విషయానికి వస్తే మూడోసారి ముచ్చటగా మూడో రౌండ్ వేద్దామని రెడీ అవుతున్నారట. ఈనెల 18-21 తేదీల మధ్య నంద్యాలలోనే క్యాంపు వేయాలని స్ధానిక నేతలు చంద్రబాబుకు సూచించారట. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఏకంగా రెండువారాల పాటు నంద్యాలలోనే క్యాంపు వేస్తానని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అటువంటి పరిస్ధితిల్లో చంద్రబాబు కనీసం మూడు రోజులైనా క్యాంపు వేయకపోతారా అని స్ధానిక టిడిపి నేతలు ఎదురుచూస్తున్నారు. ఆ మూడు రోజుల్లో ఓ భారీ బహిరంగ సభతో పాటు రోడ్డుషోలు కూడా చేయాలని ప్లాన్ వేస్తున్నారట. మరి మూడు రోజుల పాటు చంద్రబాబు నంద్యాలలో క్యాంపు వేస్తారా లేదా అన్నది చూడాలి.
