శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
విజయదశమి రోజే ఏపీ అసెంబ్లీకి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని నిర్మాణంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబుఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో 1350 ఎకరాల్లో పరిపాలనా కేంద్రం ఏర్పాటు అవుతున్నదని అన్నారు. 12న అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ప్రభుత్వ భవనాల డిజైన్లపై సీఆర్‌డీఏ ఉన్నతాధికారులతో నార్మన్‌ఫోస్టర్స్ బృందం చర్చలు జరుపుతుందని ఆయన వెల్లడించారు. 13 వ తేదీన అసెంబ్లీ, హైకోర్టు తుది డిజైన్లను ఖరారుచేస్తామని అన్నారు. మరో రెండు రోజుల్లో బ్రిటన్ ఆర్కిటెక్ట్‌ల బృందం విజయవాడ రాబోతున్నట్లు చెప్పారు. బహుళ అంతస్థుల హౌసింగ్ నిర్మాణాలకు కూడా పండుగ రోజే ఆయన శంకుస్థాపన చేస్తారు.
