ఢిల్లీ నాయకత్వం విషయంపై అసెంబ్లీలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, వైసిసి ఎంపి విజయసాయిరెడ్డికి చాలా వపర్ ఫుల్ లాబీ ఉందన్నారు. రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్ నాధ్ కోవింద్ ను బహిరంగంగా ప్రకటించక ముందే  వైసిపి రాజ్యసభ  సభ్యుడు విజయసాయిరెడ్డి  అభినందనలు తెలపటాన్ని ఉదాహరణగా చెప్పారు. అభినందనలు తెలపటమే కాకుండా ఎక్కడో బీహార్లో ఉన్న రామ్ నాధ్ ను కలిసి ఫొటోలు దిగటం తనకు ఆశ్చర్య కలిగించిందన్నారు.

బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి చెబితే కానీ తనకు రామ్ నాథ్ కోవింగ్ అభ్యర్ధిత్వం విషయం తెలియదన్నారు. అయితే, అప్పటికే విజయసాయి రామ్ నాధ్ ను కలవటం, ఫొటోలు దిగటం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఆర్ధిక నేరగాళ్ళకు అంతటి పట్టు ఎలా వచ్చిందో తనకు అర్దం కావటం లేదని చంద్రబాబు అన్నారు. అటువంటి వారిని అధికార కేంద్రాలకు దూరంగా ఉంచాల్సింది పోయి ఎంటర్ టైన్ చేయటమేంటంటూ మండిపడ్డారు.