చంద్రబాబునాయుడు విచిత్రమైన లాజిక్కులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగకపోవటానికి ప్రతిపక్ష వైసీపీనే కారణమట. టిడిపి నేతలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఆ మేరకు వైసీపీపై మండిపడ్డారు.

చంద్రబాబునాయుడు విచిత్రమైన లాజిక్కులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగకపోవటానికి ప్రతిపక్ష వైసీపీనే కారణమట. టిడిపి నేతలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఆ మేరకు వైసీపీపై మండిపడ్డారు. ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న ప్రతీ అభివృద్ధి పనిని వైసీపీ అడ్డుకుంటోందని తీవ్ర అసహనం వ్యక్తం చేయటం గమనార్హం. ఇంతకీ వైసీపీ ఏ విధంగా అడ్డుపడుతోందట? ఉపాధిహామీ పనుల్లో పొక్లయిన్లను వాడుతున్నారని వైసీపీ ఎంపిలు వైవీ సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదులు చేసారట. అందుకనే ఉపాధిహామీ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరిగిందట. అదే సందర్భంలో ఎంపిలు రాసిన ఫిర్యాదులను కూడా చంద్రబాబు చదివి వినిపించారు లేండి.

సరే, కేంద్రం జరిపిన విచారణలో ఎంపిల ఫిర్యాదు తప్పని తేలిందట. ఈ నెలాఖరుకల్లా రూ. 600 కోట్లు విడుదల అవుతాయని ఆశిస్తున్నట్లు కూడా చెప్పారు. ఇంతకీ ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరగటం లేదా? తమ్ముళ్ళు పెద్ద ఎత్తున దోచుకుంటున్నది నిజం కాదా? ఏ కార్యక్రమం చెపట్టినా భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నది వాస్తవమే కదా? పోలవరం, పట్టిసీమ, పుష్కరాల పనులు...ఎందులో చూసినా తమ్ముళ్ళ చేతివాటం స్పష్టంగా బయటపడుతోంది.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ప్రభుత్వంలో జరిగే అవినీతి, అక్రమాలను ప్రతిపక్షం ఎండగట్టటం మామూలే కదా? పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నపుడు టిడిపి చేసిందేమిటి? కాంగ్రెస్ ప్రభుత్వంలోని మొదటి ఐదేళ్ళ వైఎస్ హయాంపై చంద్రబాబు ఏకంగా పెద్ద పుస్తకాన్నే అచ్చేసారు కదా? అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో పాటు జాతీయ నేతలందరికీ ఢిల్లీకి వెళ్ళి మరీ పంచిపెట్టింది వాస్తవం కాదా? అంటే, అప్పుడు చంద్రబాబు చేస్తే ఒప్పు...అదే పనిని ఇపుడు వైసీపీ చేస్తుంటే తప్పా ? అయినా ప్రతిపక్షం అడ్డుకుంటేనే అభివృద్ధి ఆగిపోతోందంటే చంద్రబాబు ప్రభుత్వం అంత చేతకానిదా?