పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు ఓటువేయాలనేది తన ఉద్దేశ్యంగా చెప్పారు. అదే విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. అయోగ్యులకు ఓటు వేస్తే రాష్ట్రాభివృద్ధి తల్లక్రిందులవుతుందట. ‘ఎన్నికల్లో డబ్బులకు ఆశపడి ఓట్లు వేయవద్దని మాత్రమే నేను చెప్పాను’ అని సిఎం తెలిపారు.
‘పనిచేసే ప్రభుత్వాలకే ప్రజలు ఓటువేయాలన్నది తన వ్యాఖ్యల ఉద్దేశ్యం’..చంద్రబాబు తాజాగా పార్టీ నేతలతో అన్న మాటలు. నంద్యాల పర్యటనలో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు జాతీయ స్ధాయిలో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. జాతీయస్ధాయిలో రచ్చ రచ్చ అయిన తర్వాత సిఎంకు తన వ్యాఖ్యలు జాతీయస్ధాయిలో ఎంతటి దుమారం రేపిందో అర్ధమైంది. అందుకనే తన వ్యాఖ్యలను సమర్ధించుకోవటంలో పడ్డారు.
శనివారం సాయంత్రం పార్టీ నేతలతో మాట్లాడుతూ, పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు ఓటువేయాలనేది తన ఉద్దేశ్యంగా చెప్పారు. అదే విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. అయోగ్యులకు ఓటు వేస్తే రాష్ట్రాభివృద్ధి తల్లక్రిందులవుతుందట. ‘ఎన్నికల్లో డబ్బులకు ఆశపడి ఓట్లు వేయవద్దని మాత్రమే నేను చెప్పాను’ అని సిఎం తెలిపారు. అయితే, తన వ్యాఖ్యలను ఒక వర్గం మీడియా వక్రీకరించి తప్పుడు అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసినట్లు చంద్రబాబు వాపోయారు.
అంటే నంద్యాలలో తాను ఏం మాట్లాడారో కూడా చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. తన ప్రభుత్వం నచ్చని వారు తానిస్తున్న రేషన్ తీసుకోవద్దని, ఫించన్లు తీసుకోవద్దని, తాను వేస్తున్న రోడ్లపై నడవద్దని బెదిరించిన మాటల క్లిప్పింగులను ఒకసారి వీడియోలో చూస్తే బాగుంటుంది.
