ప్రతిపక్షాలు తప్ప ఆంధ్రలో ప్రజలంతా నోట్లరద్దును బలపరుస్తున్నారన్న బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు చెన్నైలో చాలా అసక్తి కరమయిన విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలు తప్ప ఎవ్వరూనోట్ల రద్దు ను వ్యతిరేకించడం లేదని ప్రకటించారు. వ్యతిరేకించే వాళ్ల సంఖ్య పదిశాతమే శాతమేనని అన్నారు.
ఇది నిజమా. ఇలా స్టాండు మార్చడం ఎన్నోసారో..ప్రజలంతా లెక్క తప్పారు. క్యాబినెట్ మీటింగ్ లలలో, అధికారుల సమావేశాలలో ’ నా జీవితంలో ఇలాంటి విపత్తును చూడలేదు,‘ అని ఎన్నోసార్లు అన్నారు. అంటే, విజయవాడలో తెలుగులో మాట్లాడేదొకటి, మోదీకోసం మరొకటి మాట్లాడుతున్నడనిపిస్తుంది.
ముఖ్యమంత్రి ఈరోజు ఇండియాటుడే పత్రిక నిర్వహిస్తున్న దక్షిణ భారత సదస్సుకు హాజరయ్యారు. అక్కడ పత్రిక కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయితో మాట్లాడుతున్నపుడు ఈ విషయాలు చెప్పారు.
‘ మా రాష్ట్రంలో నోట్ల సమస్య లేనే లేదు. 90శాతం మంది ప్రజలు ప్రధాని మోదీ నోట్ల రద్దు ను బలపరుస్తున్నారు. కేవలం పది శాతం మంది మాత్రమే నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారు,’ అని బాబు అన్నారు.
రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశముందా అని ప్రశ్నిస్తే యునైటెడ్ ఫ్రంట్ హయాంలో రెండు సార్లు తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు.
మోదీతో ఎలాంటి సంబంధాలున్నాయని అడిగితే, సూటిగా సమాధానం చెప్పకుండా, ‘దోరణులు భిన్నమయాని, మనమంతా దేశం బాగుకు కలసిపనిచేయాల్సిందే,’ అని అన్నారు.
మోదీ, వాజ్ పేయిలలో ప్రధానిగా ఎవరు మేలు అంటే, అలా పోల్చడం మంచిదికాదని చెప్పారు.
‘అమరావతి దేశంలో ఉత్తమ నగరమయిపోతుంది. హైదరాబాద్ కంటే బాగుంటుంది. డెవలప్ మెంటుకు సంబంధించి ‘ఆంధ్రప్రదేశ్ మోడల్ ’ అనేదొకటి తయారుచేస్తున్నా. ప్రజలు నన్నెపుడూ గుర్తుంచుకుంటారు’
