టికెట్ విషయంలో భూమా వర్గాన్ని బుజ్జగించేందుకు నాయుడి దూతలు సిద్ధం. చివరి క్షణంలో నంద్యాల టికెట్ శిల్పా కు వెళ్లినా ఆశ్చర్యం లేదు. తొందర్లో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నిజంగానే తలనొప్పి తెస్తున్నది.
ఏది ఏమయినా ఆయన పార్టీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డిని తెలుగుదేశం వీడకుండా, వైసిసిలోకి వెళ్లకుండా ఉండాలని చూస్తున్నారు. తాను శిల్పాను ఎంత గౌరవిస్తాడో, అభిమానిస్తాడో తెలియచేప్పేందుకు ఆయన స్వయంగా కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. తేదీ రెండు మూడు రోజులలో ఖరారవుతుంది.
ఇప్పటికే ఆయన ఎస్వీమోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఫరూక్ లను రంగంలోకి దింపి, భూమా, శిల్పా వర్గాలతో మంతానాలు సాగిస్తున్నారు. చివరి క్షణంలో పరిస్థితులు తారుమారయి, టికెట్ ను శిల్పాకు ప్రకటించి భూమా వర్గం, వైసిపి అవాక్కయ్యే లా చేయనున్నారని తెలిసింది. శిల్పా వైసిసిలోకి వెళ్లడమంటే, జగన్ వర్గానికి పండగే. ఇక పొరపాటున నంద్యాల లో వైసిపి తరఫున ఆయనగెలిస్తే, జగన్ 2019 ఎన్నికలు ఫలితాల ఇప్పుడే వచ్చినంతగ ప్రచారం చేస్తాడు. అందువల్ల ఇలాంటి అవకాశమీయకుండాఉండేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు.
శిల్పా బ్రదర్స్ తో ఒక రౌండు చర్చలు బుధవారం రాత్రి జరిగాయి. మరొక రౌండు ఇపుడు అఖిల ప్రియ మేనమామ అయిన ఎస్ వి మోహన్ రెడ్డి, ఎన్ ఎమ్డీ ఫరూక్ లు సాగిస్తున్నారు. చివర్లో తానే కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లి అందరితోమాట్లాడి... ఈ వివాదానికి తెర వేస్తారు. అనుకోని పరిస్థితి ఎదురయి, టికెట్ ను శిల్పాకు ఇవాల్సి వస్తే, అఖిల ప్రియని ఎలా బుజ్జగించాలో కూడా ముఖ్యమంత్రి ప్లాన్ వేసుకున్నారట. ఈ విషయంలో చిన్న బాబు ను దించకపోవడానికి కూడా కారణం ఇది మరీ సీరియస్ వ్యవహారమయినందునే అంటున్నారు.
శాసనమండలి ఛెయిర్మన్ పోస్టు శిల్పా సోదరుడికి ఇవ్వజూపినా ఆయన తిరస్కరించాడంటే, ఈ టికెట్ శిల్పాకు ఎంత ముఖ్యమో ముఖ్యమంత్రి గ్రహించారని చెబుతున్నారు. అందువల్ల తొందరపాటు పనికిరాదని, ఒక పొరపాటును వైసిసి సొమ్ము చేసుకోకుండా చూడాలని ఆయన జిల్లా పార్టీ నాయకులకు సూచనలిచ్చారు.
అందుకే తాజాగా ఇపుడు ఆయన దూతలు శిల్పాకు టికెట్ క విషయంలో భూమా వర్గాన్ని బుజ్జగించే పనిలో ఆయన పడ్డారు. దీనిమీద ఎస్వీ మోహనరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్‌తో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చేనాటికి పట్టింపులకు పోకుండా పార్టీ బాగు నిమిత్తం తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాలని ఆయన భూమ వర్గానికి కూడాసంకేతాలు పంపినట్లు తెలిసింది.
శిల్పా వెనుదిరిగితే, వైసిసి అభ్యర్థిగా ఉలవల ప్రతాప్ రెడ్డి పేరు ఖారారవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
టిడిపికి గుడ్ బై చెప్పి వైసిపిలోకి రావడం మీద శిల్పా వూగిసలాడుతున్నారని, ఫర్మ్ గా లేరని , జగన్ క్యాంపులో కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికలకు సిద్ధం కావాలని వైసిపి అధ్యక్షుడు జగన్ ప్రతాపరెడ్డికి సమాచారం పంపినట్లు తెలిసింది.
