సెల్ఫ్ ప్రమోషన్లో చంద్రబాబునాయుడుకి మించినోళ్ళు లేరు.
సెల్ఫ్ ప్రమోషన్లో చంద్రబాబునాయుడుకి మించినోళ్ళు లేరు. ముందు తనను తను ప్రమోట్ చేసుకున్నారు. తర్వాత కొడుకు నారా లోకేష్ ను ప్రమోట్ చేయటానికి నానా అవస్తలు పడ్డారు. తాజాగా మనవడు నారా దేవాన్ష్ ను ప్రమోట్ చేస్తున్నారు. గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు తనతో పాటు మనవడిని కూడా వెంట పెట్టుకుని వచ్చారు. ఎప్పుడూ చూసే చంద్రబాబు మొహాన్ని ఏమి చూస్తామంటూ కొత్తగా కనిపిస్తున్న దేవాన్ష్ ను అందరూ ఆశక్తిగా చూసారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులర్పించిన చంద్రబాబు తర్వాత మనవడి చేతికి పూలందించి వందనం చేయించారు. తర్వాత మాట్లాడుతూ, దేశ నేతల నుండి స్పూర్తి పొందేలా పిల్లలను చైతన్యపరచాలని సూచించారు.
