Asianet News TeluguAsianet News Telugu

అపుడు తిండిపెట్టారు...ఇపుడు ఇంగ్లీష్ నేర్పండి

"ఆంధ్రప్రదేశ్‌-ఇంగ్లండ్ నడుమ అనుబంధం ఈనాటిది కాదు, ధవళేశ్వరం, ప్రకాశం, సంగం బ్యారేజీల నిర్మాణంతో తమ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మలిచిన ఘనత ఆనాటి బ్రిటిష్ అధికారులది.   ఇపుడు ఇంగ్లీష్ నేర్పించి ఉద్యోగాలు తెచ్చుకునేందుకు అవకాశం కల్పించబోతున్నారు."

Naidu lauds britishers efforts to improve lives of Andhras in 19 th century

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆంధ్రోళ్లంతా ఆంగ్లంలో మాట్లాడాలని తెగా ఆరాటం. అంగ్లేయుల్లాగా తెలుగోళ్లు ఇంగ్లీషు మాట్లాడటం మొదలుపెడితే  ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆయన విశ్వాసం. ఇది మంచిదే. ఈ ఇంగ్లీష్ నేర్పించే పనిని ఆయన బ్రిటిష్ కౌన్సిల్ కు అప్పగించారు. ఇదీ కూడా మంచిదే. అయితే, దీనికి  ఆయన సమర్థింపే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

 

"ఆంధ్రప్రదేశ్‌-ఇంగ్లండ్ నడుమ అనుబంధం ఈనాటిది కాదు, ధవళేశ్వరం, ప్రకాశం, సంగం బ్యారేజీల నిర్మాణంతో తమ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మలిచిన ఘనత ఆనాటి బ్రిటిష్ అధికారులది.   ఇపుడు ఇంగ్లీష్ నేర్పించి ఉద్యోగాలు తెచ్చుకునేందుకు అవకాశం కల్పించబోతున్నారు." అని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

 

తెలుగోళ్లకు ఇంగ్లీష్ నేర్పించడానికి సంబంధించిన గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా సమితి (APSCHE) - బ్రిటిష్ కౌన్సిల్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన నాటి బ్రిటిషోళ్లు ప్రాజక్టులు కట్టిఆంధ్రులకు తిండిపెట్టిన సంగతి చెప్పారు.

 

ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాజెక్టు’ కింద రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకుంటున్న వారిలో లక్ష మంది విద్యార్ధులకు ఆంగ్లాన్ని సులభంగా అభ్యసించేలా బ్రిటిష్ కౌన్సిల్ శిక్షణ ఇవ్వనుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో   ఈ ఒప్పందం కుదిరింది.

 

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముందుగా బ్రిటిష్ కౌన్సిల్‌ను అభినందించారు. ఏడాదిలో లక్ష మంది విద్యార్ధులను ఆంగ్ల భాషలో ప్రావీణ్యులను చేయాలని సంకల్పించడం సాధారణ లక్ష్యం కాదని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌-ఇంగ్లండ్ నడుమ అనుబంధం ఈనాటిది కాదని, ధవళేశ్వరం, ప్రకాశం, సంగం బ్యారేజీల నిర్మాణంతో తమ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మలిచిన ఘనత ఆనాటి బ్రిటిష్ అధికారులదేనని గుర్తుచేశారు.  ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

 

  ఇంగ్లిష్‌పై పట్టు సాధించి యువత ఉద్యోగ-ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకునేందుకు, విద్యా సంబంధిత ఉన్నతికి ‘ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాజెక్టు’ దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్ధి ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాల్సిన అవసరం వుందని అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల మధ్య పోటీ వాతావరణం తీసుకువచ్చి మెరుగైన ఫలితాలు రాబడుతున్నామని చెప్పారు. తెలుగు తప్పనిసరిగా అభ్యసిస్తూనే ఇంగ్లిష్, హిందీ ఇంకా ఒకటి రెండు స్వదేశీ, విదేశీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించేలా విద్యార్ధులను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.

 

  ఈ ప్రాజెక్టు రాక కేవలం విద్యార్ధులకే కాకుండా ఆంగ్ల భాష అధ్యాపకులకు ఉపకరిస్తుంది. అధ్యాపకులు తమ భోదనా పద్ధతులు ఉత్తమంగా వుండేలా, సంభాషణ చాతుర్యం ఉన్నతరీతిలో సాగేలా తీర్చిదిద్దుకునేందుకు వీలు కలుగుతుంది. అధ్యాపకుల శిక్షణ కోసం మాస్టర్ ట్రైనర్లు అందుబాటులో వుంటారు. వీరంతా విదేశీ పని వాతావరణానికి తగినట్టుగా విద్యార్ధుల్లో స్పోకెన్ ఇంగ్లిష్ సామర్ధ్యం పెంచేందుకు తోడ్పాటు బ్రిటిష్ కౌన్సిల్ అందిస్తుందని  ముఖ్యమంత్రి చెప్పారు 

 

Follow Us:
Download App:
  • android
  • ios