గ్రామంలో కరెంటు లేదని ఫిర్యాదు చేసిన ఓ గ్రామస్తుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘ఏం తాగొచ్చావా’ అంటూ హూంకరించారు. ‘నాసభకొచ్చి తాగేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా’ ఎంత ధైర్యం నీకు’ అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా ‘ఏం జగన్మోహన్ రెడ్డి పంపించారా..నీలాంటి వాళ్ళని ఎన్ని వందలమందిని చూసుంటా’ అంటూ విరుచుకుపడ్డారు. సిఎం వచ్చారు కాబట్టి తమ సమస్యలు చెప్పుకుందామని అనుకుంటే చంద్రబాబు మాట్లాడిన తీరుతో గ్రామస్తులు నివ్వెరపోయారు.

నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలోని యాలూరు గ్రామస్తులపై చంద్రబాబునాయుడు శివాలెత్తిపోయారు. ఉపఎన్నికల ప్రచారానికి శనివారం చంద్రబాబు నంద్యాలకు వచ్చారు. అదే సందర్భంగా యాలూరులో కూడా రాత్రి పర్యటించారు. తన పర్యటనలో వాహనంపైనుండి చంద్రబాబు ప్రసంగించటానికి సిద్ధపడగానే గ్రామస్తులు తమ సమస్యలను ఏకరవుపెట్టారు. దాంతో చంద్రబాబు ఒక్కసారిగా గ్రామస్తులపై మండిపడ్డారు.

ఎక్కువమాట్లాడితే అరెస్టు చేయిస్తానన్నారు. గ్రామంలో కరెంటు లేదని ఫిర్యాదు చేసిన ఓ గ్రామస్తుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘ఏం తాగొచ్చావా’ అంటూ హూంకరించారు. ‘నాసభకొచ్చి తాగేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా’ ఎంత ధైర్యం నీకు’ అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా ‘ఏం జగన్మోహన్ రెడ్డి పంపించారా..నీలాంటి వాళ్ళని ఎన్ని వందలమందిని చూసుంటా’ అంటూ విరుచుకుపడ్డారు. సిఎం వచ్చారు కాబట్టి తమ సమస్యలు చెప్పుకుందామని అనుకుంటే చంద్రబాబు మాట్లాడిన తీరుతో గ్రామస్తులు నివ్వెరపోయారు.

అయినా కొందరు సమస్యలు చెప్పటం మొదలుపెట్టారు. దాంతో చంద్రబాబు మరింత రెచ్చిపోయారు. ‘రేపు జిల్లా కలెక్టర్, ఆర్డిఓలను గ్రామానికి పంపుతా, అందరితో మాట్లాడిస్తా, ఒకవేళ నీవు చెప్పింది తప్పని తేలితే పోలీసు కేసు పెట్టిస్తా’ అంటూ ఓ గ్రామస్తుడిని తీవ్రంగా హెచ్చరించారు. దాంతో తామేం చెబుతున్నామో, చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాక సిఎం చెప్పేది వినకుండా గ్రామస్తులు ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టారు. దాంతో సభ రసాబాస అయిపోయింది.