జాతీయ స్ధాయిలో రచ్చవటంతో పరువు కాపాడుకునేందుకు వేరే దారి లేక ప్రభుత్వం ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోకముడిచింది. చంద్రబాబు ఇమేజ్ ను జాతీయ స్ధాయిలో ఫోకస్ చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టింది. సిఎం గురించి ఫోకస్ చేస్తూ జాతీయ స్ధాయిలో ప్రచారం వచ్చేట్లుగా ప్రభుత్వం పెద్ద ప్లాన్ వేసింది.
అందుకోసం తలా రూ. 50,149 వేలు జీతంతో 25 మంది జర్నలిస్టులను నియమించేందుకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
అయితే, ఆ విషయం బయటపడిన తర్వాత పెద్ద చర్చ మొదలైంది. అదే సమయంలో సామాజిక కర్యకర్త, సుప్రింకోర్టు న్యాయవాధి ప్రశాంత్ భూషణ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ట్విట్టర్ లో తూర్పారబట్టారు. దాంతో విషయం మొత్తం రచ్చ రచ్చైంది.
తన ప్రచారం కోసం చంద్రబాబు 25 మంది జర్నలిస్టులకు అధికారికంగా లంచాలిస్తున్నట్లు ట్విట్టర్ లో ప్రశాంత్ చేసిన ఘాటైన వ్యాఖ్యలకు జాతీయ మీడియా బాగా ప్రాముఖ్యత ఇచ్చింది.
దాంతో ఏమి చేయాలో ప్రభుత్వానికి అర్ధం కాలేదు. విషయం జాతీయ స్ధాయిలో రచ్చవటంతో పరువు కాపాడుకునేందుకు వేరే దారి లేక ప్రభుత్వం ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
