నంద్యాల చేరుకున్న తర్వాత స్ధానిక నేతలతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పార్టీ  పరిస్ధితి అర్ధమైపోయింది. దాంతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత రాత్రికి నంద్యాలలోనే బస చేయాలని అప్పటికప్పుడు నిర్ణయించారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని నేతలందరినీ పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబడుతోంది.

నంద్యాల ఉపఎన్నిక నేపధ్యంలో చంద్రబాబునాయుడులో ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది. అందుకనే రాత్రికి నంద్యాలలోనే బస చేయాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం వచ్చి సాయంత్రానికి తిరిగి విజయవాడకు వెళ్ళిపోవాలి. అయితే, నంద్యాల చేరుకున్న తర్వాత స్ధానిక నేతలతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత పార్టీ పరిస్ధితి అర్ధమైపోయింది. దాంతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత రాత్రికి నంద్యాలలోనే బస చేయాలని అప్పటికప్పుడు నిర్ణయించారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని నేతలందరినీ పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబడుతోంది.

నియోజకవర్గంలో ప్రచారానికి ఇప్పటికే పదిమందికి పైగా మంత్రులు, డజను మంది ఎంఎల్ఏలు ప్రచారంలో బిజిగా ఉన్నారు. వీరు చాలదన్నట్లు అదనంగా 25 మంది ఎంఎల్ఏలతో పాటు ఆరుగురు ఎంఎల్సీలను కూడా కేటాయించారు. వీరందరూ జిల్లాలో నేతలకు అదనం. ఇంతమంది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా చంద్రబాబులో ఎక్కడో అనుమానం తొంగిచూస్తోందన్నది స్పష్టమవుతోంది. దానికితోడు వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందుకే రాత్రికి బస చేసి నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు.