Asianet News TeluguAsianet News Telugu

(వీడియో) అంతా నేనే చేసాను...అంతా నేనే చేసాను...

  • అంతా తానే చేసాను..అంతా తానే చేసాను..చంద్రబాబునాయుడుకు ఇదొక ఊతపదమైపోయింది.
  • తనకు సంబంధం లేకపోయినా సరే ప్రతిదీ తానే చేసానని, తన వల్ల వచ్చిందని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం బాగా ఎక్కువైపోయింది.
  • నిజానికి ఈ ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేసింది ఎన్టీఆర్.
  • తర్వాత ముఖ్యమంత్రైన చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై తీసుకున్న శ్రద్ధ తక్కువే.
  • 2005లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జలయజ్ఞంలో నిధులిచ్చి పనులు మొదలుపెట్టారు.
Naidu claims every positive thing to his credit

అంతా తానే చేసాను..అంతా తానే చేసాను..చంద్రబాబునాయుడుకు ఇదొక ఊతపదమైపోయింది. తనకు సంబంధం లేకపోయినా సరే ప్రతిదీ తానే చేసానని, తన వల్ల వచ్చిందని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం బాగా ఎక్కువైపోయింది. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనం. అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో హంద్రీ-నీవా ప్రాజెక్టు నుండి శుక్రవారం నీటిని వదిలారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ, 1996లో ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్ధాపన చేసానంటూ చెప్పుకున్నారు. అంతవరకూ నిజమే కావచ్చు. కానీ చంద్రబాబు చెప్పిందెలా ఉందంటే, తాను మాత్రమే ఈ ప్రాజెక్టు కోసం కష్టపడ్డినట్లుగా చెప్పుకున్నారు.

నిజానికి ఈ ప్రాజెక్టుకు డిజైన్ చేసింది ఎన్టీఆర్. తర్వాత ముఖ్యమంత్రైన చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై తీసుకున్న శ్రద్ధ తక్కువే. 2005లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జలయజ్ఞంలో నిధులిచ్చి పనులు మొదలుపెట్టారు. తర్వాత ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా పనులు జరిగాయి. 2014లో సిఎం అయిన తర్వాత చంద్రబాబు ప్రాజెక్టు అంచనాలు పెంచేసి పనులు జరిపిస్తున్నారు. ఇపుడు మొదటిదశ పనులు పూర్తయి నీటిని వదిలారు.

 

అంటే ప్రాజెక్టు నుండి నీటిని వదలటంలో ఒక్క చంద్రబాబే కాదు మరో నలుగురు ముఖ్యమంత్రుల పాత్ర కుడా ఉంది. నిజానికి ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వారికిచ్చేస్తే చంద్రబాబు పెద్ద మనసు గురించే అందరూ గొప్పగా చెప్పుకుంటారు. అదే ఎవరికో దక్కాల్సిన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటే చంద్రబాబుకు భంగపాటు  తప్పదు. ఎందుకంటే, జనాలకు తెలుసు ఎవరేం చేస్తున్నారో. 

 

చంద్రబాబుకు మొదటి నుండి ఓ అలవాటుంది. ఏదైనా మంచి జరిగితే అంతా తానే చేసానని చెప్పుకోవటం. అదే చెడు జరిగితే మాత్రం అంతా ఎదుటి వాళ్ళ వల్లే జరిగిందని బట్టకాల్చి మీదేసేయటం. హంద్రీ-నీవా ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెప్పకపోయినా ఎవరెవరి పాత్ర ఏంటో అందరకీ తెలుసు. కాబట్టే, వైసీపీ ఎంఎల్ఏ విశ్వేశ్వర రెడ్డి వేదిక మీదనుండే చంద్రబాబు గాలి తీసేసారు. ఈ ప్రాజెక్టనే కాదు తోటపల్లి, చింతలపూడి ఎత్తిపోతల పథకం మొదటి దశ, గండికోట, పోలవరం, పట్టిసీమ..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలోనే మొదలయ్యాయి. కాకపోతే అన్నీ తన హయాంలోనే మొదలై పూర్తవుతున్నట్లు చెప్పేసుకోవటం చంద్రబాబుకు అలవాటైపోయింది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios