ఆంధ్రలో భారీగా టెలిఫోన్ టాపింగ్ : వైఎస్ఆర్ సి

Naidu bugging opponents phones
Highlights

  • చంద్రబాబు నాయుడు ప్రత్యర్థుల ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారు : వైఎస్ ఆర్ సి ఆరోపణ
  • ప్రతిపక్షపార్టీ నాయకులనే కాదు,సొంతపార్టీ నాయకులకు కూడా వదలడం లేదు
  • పోలీసాఫీసర్ల, బిజెపినాయకుల ఫోన్లు కూడా నిఘాలో ఉన్నాయి

ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమమయిన అరోపణ చేసింది.  ప్రతిపక్షనాయకుల మీద, తనను విమర్శిస్తున్న వారి పత్రికల మీద, పోలీసుఅధికారుల మీద, చివరకు సొంత పార్టీ నాయకులను కూడా ఆయన వదలకుండా టాపింగ్ చేస్తున్నారని ఈ పార్టీ చెప్పింది.

 

ప్రభుత్వం వ్యతిరేకులందరిని నయాన కాకుంటే భయాలన లొంగదీసుకునేందుకు వారి  ఫోన్లను ట్యాప్ చేస్తోందని  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.ముఖ్యమంత్రి ట్యాపింగ్ మారణాయుధంగా వాడుతున్నారని అన్నారు.

 

 ’తనపట్ల అసహనంగా ఉన్న ప్రజల మీద,తన అవినీతికి వ్యతిరేకంగా  పోరాటం చేస్తున్న వారికి వ్యతిరేకంగా, ప్రజాసంఘాలను, ప్రతిపక్షాలను బెదిరించేందుకు చంద్రబాబుప్రభుత్వం అనైతిక కార్యక్రమాలకు తెర తీసి పోన్ ట్యాపింగ్ కు పాల్పడుతూ ఉంది,’అని ఆయన ఆరోపించారు.ఈ విషయాన్ని పార్లమెంటులో లేవదీస్తామని కూడా భూమన చెప్పారు.

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెందిన నాయకులందరి  ఫోన్ల ను ట్యాప్  చేసి వారి మీద రాజకీయ వత్తిడి తెస్తున్నదని ఆయన చెప్పారు. దీనికి తమ సాక్ష్యాలున్నాయని కూడా ఆయన చెప్పారు.

 

ప్రతిపక్షనాయకుల మీదే కాదు తన వ్యతిరేకించేవారినందరిమీద నిఘా వేసి  ప్రభుత్వం కుట్ర చేసున్నది ’ ఆయన ఆరోపించారు.ఈ విధానం చంద్రబాబు నాయుడు ఓటుకునోటు కేసు నుంచి నేర్చకున్నారని భూమన అన్నారు. పత్రికలను ప్రసార మాధ్యమాలను బెదిరించి తనకు అనుకూలమయిన వార్తలురాయించకునందుకు ఈ నిఘాపెడుతున్నారు.

 

’ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అదే అంశాన్ని ఆయుధంగా చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి మా వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయి. మా పైనే కాదు, పారిశ్రామికవేత్తలు, పోలీసులు అధికారులు, పత్రికల యజమానులు, సొంత పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. తమకు అనుకూలంగా కథనాలు రాసేలా పత్రికల యజమానుల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్లను దాసులుగా చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు,’ అని ఆయన ఆరోపించారు.

 

సాధారణంగా కేంద్ర హోంశాఖ అనుమతితో దేశద్రోహుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేసేందుకు చట్టం అనుమతిస్తుందని చెబుతూ  తెలుగుదేశం అధినేత చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

 

’ ఫోన్లు ట్యాప్ చేస్తూ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారు. చంద్రబాబుకు దమ్ముంటే  ప్రభుత్వం  ఫోన్లను ట్యాప్ చేయలేదని స్పష్టంగా చెప్పాలి. ఫోన్ల ట్యాపింగ్ కు వ్యతి రేకంగా సమైక్యంగా పోరాడతాం. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు,’ అని ఆయన అన్నారు.

 

బీజేపీ నేతలను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. తనను వ్యతిరేకించేవారి జీవితాలను ఛిద్రం చేయాలన్న ఆలోచన చంద్రబాబుది. చట్టాన్ని ఉల్లంఘించి టెక్నాలజీ వాడుకుంటూ ప్రజలకు వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ అనే మారణాయుధాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. చంద్రబాబు చేస్తున్న దాష్టికాన్ని ఎండగట్టేందుకు అందరూ ఒకటవ్వాలి.అని పిలుపునిచ్చారు.

 

loader