‘‘వివాదాలు సృష్టించేందుకే వైసీపీ రభస చేస్తోంది’’..‘‘భూముల వేలంలో దేవాదాయ శాఖ నిజాయితీగా పనిచేసింది’’...ఇది జిల్లాల కలెక్టర్ల రెండు రోజుల సదస్సులో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. సదావర్తి భూముల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతకి పాల్పడి గబ్బు పట్టిన సంగతి వాస్తవం. ఆ గబ్బును కడుక్కోవటంలో భాగంగా చంద్రబాబు వైసీపీకి పూసే ప్రయత్నం చేస్తున్నారు.

‘‘వివాదాలు సృష్టించేందుకే వైసీపీ రభస చేస్తోంది’’..‘‘భూముల వేలంలో దేవాదాయ శాఖ నిజాయితీగా పనిచేసింది’’...ఇది జిల్లాల కలెక్టర్ల రెండు రోజుల సదస్సులో చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. సదావర్తి భూముల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతకి పాల్పడి గబ్బు పట్టిన సంగతి వాస్తవం. ఆ గబ్బును కడుక్కోవటంలో భాగంగా చంద్రబాబు వైసీపీకి పూసే ప్రయత్నం చేస్తున్నారు. కలెక్టర్ల సదస్సులో రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ల సదస్సు కాబట్టే చంద్రబాబు ఏం మాట్లడినా చెల్లుబాటవుతుంది.

సదావర్తి సత్రం భూములపై నిజంగానే ఆసక్తి ఉంటే, ముందువేసిన వేలంలోనే వైసీపీ నేతలు పాల్గొని ఉండొచ్చు కదా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇక్కడే జరిగిన విషయాన్ని దాచిపెట్టారు. మొదటిసారి వేలం వేసినపుడు ప్రభుత్వం బహిరంగ ప్రకటన ఇచ్చిన మాట వాస్తవం. అయితే, ఎవరి దృష్టిలో పడకుండా ఉండేదుకని ఓ తమిళ పేపర్లో చిన్న ప్రకటన మాత్రం ఇచ్చింది. దాంతో వేలం ప్రకటన ఎవరి దృష్టికి వెళ్లలేదు. ప్రభుత్వంలోని ముఖ్యుల వ్యూహం ఫలించి వేలం పాటకు ఎవరూ రాలేదు. అందుకనే తమకు కావాల్సిన వారికి రూ. 22 కోట్లకు కట్టబెట్టేసారు. ఎప్పుడైతే విషయం బయటకు పొక్కిందో వెంటనే వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టుకెక్కారు.

ఇక అప్పటి నుండి రెండు రోజుల క్రితం వరకూ సదావర్తి భూముల విషయంలో ఏం జరిగిందో అందరూ చూసిందే. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ఉంటే విషయం ఇంత కంపు అయ్యేదే కాదు. ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చేదే. కానీ వందల కోట్ల రూపాయల విలువైన భూములను తన మద్దతుదారులకు ఇప్పించుకోవాలనుకున్నారు కాబట్టే మొత్తం వ్యవహారం ఇంతలా గబ్బు పట్టింది. తప్పచేసిన ప్రభుత్వం సిగ్గుపడాల్సింది పోయి ఇంకా వైసీపీపై ఎదురుదాడి చేస్తోంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గట్టిగా కోర్టులో పోరాడబట్టే ప్రభుత్వానికి ఆదాయం సుమారు రూ. 30 కోట్లు పెరిగిందన్నది నిజం. కారు చౌకగా భూములు కొట్టేద్దామనుకున్న ప్రభుత్వ పెద్దల బండారం బయటపడిందన్న అక్కసే చంద్రబాబు మాటల్లో కనబడుతోంది.